Coronavirus: చాపకింద నీరులా ఒమిక్రాన్.. భారీగా పెరిగిన కరోనా బాధితులు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది. ఢిల్లీ,మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి
దేశంలో కరోనాతో పాటు ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది. ఢిల్లీ,మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి. ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252, కేరళ 65, తెలంగాణలో 62 కేసులు నమోదుయ్యాయి. మరోవైపు కరోనా కేసులు కూడా హఠాత్తుగా పెరిగాయి. దేశంలో మొత్తం 22 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కొత్త వేరియంట్ విస్తరించింది. గత కొంతకాలంగా రోజూ 10వేలకు దిగువగానే నమోదవుతున్న కేసులు నిన్న ఒక్కరోజే 13వేల మార్కును దాటడం గమనార్హం. అదేవిధంగా గత 24 గంటల్లో 268 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు.
43 శాతం అధికంగా కేసులు..
కాగా నిన్న మొత్తం 11, 99, 252 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,154 మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ముందు రోజుకంటే నిన్న 43 శాతం అధికంగా కరోనా కేసులు నమోదవ్వడం గమనార్హం. బాధితుల సంఖ్య భారీగా పెరగడంతో క్రియాశీల కేసులపై ఈ ప్రభావం కనిపించింది. కొత్త కేసులతో కలిపి దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 82, 402కు చేరుకున్నాయి. కాగా గత 24 గంటల్లో 7486 మంది వైరస్‌ను జయించారు. ఇప్పటివరకు 3.48 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.42 కోట్లమంది రికవరీ(98.38శాతం) అయ్యారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 143 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేస్తామని కేంద్రం వెల్లడించింది.
ఆ రాష్ట్రంలోనే అత్యధికం.. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గరిష్ఠంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు 263 మందికి ఈ కొత్త వేరియంట్ సోకినట్లు కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా మహారాష్ట్రలో 252 , గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69 కేసులున్నాయని పేర్కొంది. ఇక దక్షిణభారత దేశంలోనూ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. కేరళలో 65, తెలంగాణలో 62, తమిళనాడులో 45, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
????? ?????https://t.co/rrT3krGD3S pic.twitter.com/WUlpXzU3BU
— Ministry of Health (@MoHFW_INDIA) December 30, 2021
Also Read:
RamCharan: ఆ సినిమాలకు రామ్ చరణ్ భారీ రెమ్యునరేషన్ !.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ..
Amala Paul: అరుదైన గౌరవం అందుకున్న అమలా పాల్.. గర్వంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్..