Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్‌'. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయితే ఇందులోని పాటలు అభిమానులను ఎంతగానో

Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2021 | 10:21 AM

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీమ్లా నాయక్‌’. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరికి వాయిదా పడింది. అయితే ఇందులోని పాటలు మాత్రం అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. అందులో అరుణ్‌ కౌండిన్య పాడిన ‘లా లా భీమ్లా’ అనే పాట యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. కాగా ఈ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నానంటోంది యంగ్‌ హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. ప్రస్తుతం ఆమె పవర్‌ స్టార్‌తో కలిసి ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పవన్‌ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించింది. ఇక మీకు ఇష్టమైన పాట ఏది అని ఓ నెటిజన్‌ అడగ్గా ‘ ‘భీమ్లా నాయక్’ సినిమాలోని ‘లా లా భీమ్లా’ సాంగ్ అని చెప్పింది. ఈ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నానంటూ తెలిపింది.

ఈ సందర్భంలోనే తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన జీవితం పూలపాన్పేమీ కాదని, చాలామంది లాగే సినిమా కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానంది. ఎన్నో ఫొటోషూట్‌లు, ఆడిషన్స్‌లలో రిజెక్టయ్యానని చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంది. అయితే అధైర్య పడకుండా ముందుకు సాగానని, హీరోయిన్ కావాలనుకున్న తన కలను నిజం చేసుకున్నానని పేర్కొంది. కథానాయికగా తనకు ఐశ్వర్యారాయ్‌ను ఎంతో స్ఫూ్ర్తిగా తీసుకుంటానని.. అనుష్క, కాజల్‌ అగర్వాల్‌ లను అభిమానిస్తానని తన ఇష్టాయిష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ఎంతో క్రేజ్‌ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘హరిహర వీర మల్లు’ తో పాటు గల్లా అశోక్ డెబ్యూ సినిమా ‘హీరో’లోనూ నటిస్తోందీ ముద్దుగుమ్మ. బాలీవుడ్‌లోనూ ఓ సినిమాకు సైన్‌ చేసిందని సమాచారం.

Also Read:

Amala Paul: అరుదైన గౌరవం అందుకున్న అమలా పాల్‌.. గర్వంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌..

Youtube: యూజర్లకు యూట్యూబ్‌ షాక్‌.. ఇకపై అలా చేయాలంటే పైసలు కట్టాల్సిందే..

Disha Patani: హీరోయిన్‌ అవుతానని కలలో కూడా అనుకోలేదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ బ్యూటీ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.