AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RamCharan: ఆ సినిమాలకు రామ్‌ చరణ్ భారీ రెమ్యునరేషన్‌ !.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ..

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. 'మగధీర' సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టిన అతను 'రచ్చ', 'నాయక్‌', 'ఎవడు', 'ధ్రువ' సినిమాలతో స్టార్‌ హీరో స్టేటస్‌ సొంతం చేసుకున్నాడు

RamCharan: ఆ సినిమాలకు రామ్‌ చరణ్ భారీ రెమ్యునరేషన్‌ !.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ..
Basha Shek
|

Updated on: Dec 30, 2021 | 11:35 AM

Share

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా వెండితెరకు పరిచయమైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టిన అతను ‘రచ్చ’, ‘నాయక్‌’, ‘ఎవడు’, ‘ధ్రువ’ సినిమాలతో స్టార్‌ హీరో స్టేటస్‌ సొంతం చేసుకున్నాడు. ఇక ‘రంగ స్థలం’ తో మరోసారి టాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసేశాడు. ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో పాటు కొరటాల శివ ‘ఆచార్య’ చిత్రంలో తండ్రితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనున్నాడు. మరోవైపు నిర్మాతగానూ సత్తాచాటుతున్నాడు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది.

కాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల తర్వాత శంకర్‌ సినిమా షూటింగ్‌లో బిజీ కానున్నాడు. దీంతో పాటు ‘జెర్సీ’ లాంటి మంచి ఎమోషనల్‌ సినిమాను తెరకెక్కించిన గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నటించేందుకు అంగీకారం తెలిపాడు. అయితే ఈ సినిమాల కోసం చరణ్‌ దాదాపు రూ.100 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలోనూ రామ్‌చరణ్‌ రెమ్యూనరేషన్‌పై సర్వత్రా చర్చ సాగుతోంది. కాగా ప్రభాస్‌ సైతం సందీప్‌రెడ్డి వంగ ‘స్పిరిట్‌’ సినిమా కోసం రూ.100 కోట్లు అందుకుంటున్నారని గతంలో వార్తలు వినిపించాయి. ఈక్రమంలో ప్రభాస్‌ తర్వాత అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుడు చరణేనని నెటిజన్లు చెప్పుకొంటున్నారు. అయితే ఈ విషయంపై ఎవరూ ఎలాంటి అధికారిక ప్రకటనలు విడుదల చేయలేదు. కాగా శంకర్‌ చిత్రం అంటేనే భారీతనానికి పెద్దపీట ఉంటుంది. ఇక రామ్‌ చరణ్‌ సినిమాను కూడా పాన్‌ ఇండియా స్థాయిలోనే తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు గౌతమ్‌ తిన్ననూరి. Also Read:

Amala Paul: అరుదైన గౌరవం అందుకున్న అమలా పాల్‌.. గర్వంగా ఉందంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌..

Nidhhi Agerwal: పవర్ స్టార్ పాటనే మళ్లీ మళ్లీ వింటున్నా.. ఇస్మార్ట్‌ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Youtube: యూజర్లకు యూట్యూబ్‌ షాక్‌.. ఇకపై అలా చేయాలంటే పైసలు కట్టాల్సిందే..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!