AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayyappa Prasadam: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఇంటి వద్దకే ప్రసాదం.. ఎలా పొందాలంటే..

Ayyappa Prasadam: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తర్వాత అత్యధిక ప్రాముఖ్యత ఉన్న ప్రసాదం... శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు..

Ayyappa Prasadam: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఇంటి వద్దకే ప్రసాదం.. ఎలా పొందాలంటే..
Sabarimala Ayyappa Prasadam
Surya Kala
|

Updated on: Dec 30, 2021 | 11:49 AM

Share

Ayyappa Prasadam: తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు తర్వాత అత్యధిక ప్రాముఖ్యత ఉన్న ప్రసాదం… శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం. ఏటా శబరిమల అయ్యప్పస్వామిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఆ సమయంలో అయ్యప్ప ప్రసాదం ఎక్కువగా తీసుకుని రమ్మనమని స్నేహితులు, సన్నిహితులు కూడా స్వాములకు చెబుతుంటారు. అంతగా ఆకట్టుకుంది అయ్యప్ప స్వామి ప్రసాదం.. కరోనా వైరస్ వెలుగులోకి రాక ముందు వరకూ ఏటా 80లక్షల ప్రసాదాలు తయారు అయ్యేవి.. అయితే గత రెండేళ్లుగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను పరిమితం చేయడంతో.. ప్రసాదాల తయారీకూడా తక్కువైంది. అయినప్పటికీ స్వామివారి ప్రసాదం కావాలనునే భక్తులకు మావెల్లిక్కర ట్రావెన్కోర్‌ దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అయ్యప్ప ప్రసాదాన్ని.. భక్తుల ఇంటికి పంపించడానికి రంగం సిద్ధం చేసింది.

అవును శబరిమల అరవణ ప్రసాదమెంతో రుచిగా ఉంటుంది.  దీన్ని బియ్యం, బెల్లం, నెయ్యిలతో ఎంతో రుచిగా శుచిగా  తయారు చేస్తారు. ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరంలో వేడి నిస్తుంది. అరవణ ప్రసాదానికి ఉపయోగించే బియ్యం  బియ్యం మావెల్లిక్కర ట్రావెన్కోర్‌ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి. అత్యంత ప్రాధాన్యత ఉన్న అయ్యప్ప స్వామి  అరవణ ప్రసాదాన్ని పోస్టాఫీస్ అందుబాటులోకి తెచ్చింది. దేశంలోని అయ్యప్ప స్వామి భక్తులకు స్పీడ్ పోస్ట్ ద్వారా శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం బుకింగ్ మరియు డెలివరీ కోసం తపాలా శాఖ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా పోస్ట్ యొక్క ఇ-పేమెంట్ సిస్టమ్ ద్వారా భారతదేశంలోని ఏదైనా డిపార్ట్‌మెంటల్ పోస్ట్ ఆఫీస్‌లో ప్రసాదం బుకింగ్ చేయవచ్చు. ఒక ప్రసాదం కిట్ ఖరీదు రూ.450/లు గా నిర్ణయించింది. మీరు ఒకే అప్లికేషన్‌లో 10 కిట్‌ల వరకు ఆర్డర్ చేసుకోవచ్చు. మరిన్ని అదనంగా కావాలంటే అదనపు ఫారమ్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. భక్తులు ప్రసాదం కోసం ఆర్డర్‌ల సంఖ్యకు గరిష్ట పరిమితి లేదు. ఎవరికీ ఎన్ని కాలంటే అన్ని పొందవచ్చు.

ప్రసాదం కోసం అప్లికేషన్‌ ఫారంలో పూర్తి పేరు, చిరునామా రాసి పోస్ట్‌ ఆఫీస్‌లో రూ. 450 చెల్లిస్తే శబరిమల కిట్టు ఇంటికే వస్తుంది. ఇందులో అరవణ ప్రసాదం, నెయ్యి, పసుపు, కుంకుమ, విభూతి, అర్చన ప్రసాదం ఉంటాయి. ఈ వస్తువులను అట్టపెట్టెలో ప్యాక్ చేసి స్పీడ్ పోస్ట్ ద్వారా భక్తులకు చేరవేస్తారు.

Also Read:  వృద్ధురాలికి తినిపిస్తూ.. ఓ వ్యక్తి చేసిన చిలిపిపని.. పాఠం నేర్చిన పెంపుడు కుక్క వీడియో వైరల్

Vastu Tips: తరచుగా భాగస్వామితో గొడవలు పడుతున్నారా.. అయితే బెడ్ రూమ్‌లోని ఈ వాస్తు దోషాలు విస్మరించకండి..