- Telugu News Photo Gallery Spiritual photos Best Vastu Tips: These Vastu defects of house can create quarrel in your married life do not ignore them
Vastu Tips: తరచుగా భాగస్వామితో గొడవలు పడుతున్నారా.. అయితే బెడ్ రూమ్‌లోని ఈ వాస్తు దోషాలు విస్మరించకండి..
Best Vastu Tips: ఇంట్లో వాస్తు దోషం ఉంటే అనేక సమస్యలు వస్తాయి. ఆర్థికంగానే కాదు.. మానసికంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం, వ్యక్తుల మధ్య సంబంధాలపై కూడా వాస్తు ప్రభావం ఉంటుంది. కొంతమంది తరచూ జీవిత భాస్వామితో గొడవ పడుతుంటారు. అయితే వాస్తు ప్రకారం దంపతుల బెడ్ రూమ్ ఉందో లేదో ఒక్కసారి పరిశీలించామని వాస్తునిపుణులు సూచిస్తున్నారు.
Updated on: Dec 30, 2021 | 10:19 AM

వాస్తు ప్రకారం.. పడకగదిలో అద్దం ఉండటం మంచిది కాదు. నిద్రపోతున్నప్పుడు అద్దంలో మీ శరీరంలోని ఏ భాగం అద్దంలో కనిపించకూడదని అంటారు. ముఖ్యంగా భార్యాభర్తల గదిలో అద్దం ఉంటే వారి బంధంలో చీలిక వస్తుంది. కనుక వీలుంటే పడకగదిలో అద్దం లేకుండా చూసుకోండి. ఇక తప్పని సరి అయితే అద్దం ఉత్తర లేదా తూర్పు గోడపై ఉంచి.. నిద్రపోయే సమయంలో అద్దంపై ఒక బట్టతో కవర్ చేయండి.

బయటి నుంచి ఇంట్లోకి వచ్చే ఏ వ్యక్తి చూపు నేరుగా మీ మంచం మీద పడకూడదు. దీనివల్ల వైవాహిక జీవితంలో కూడా చిరాకులు ఏర్పడతాయి. అందువల్ల బయటి వ్యక్తులకు నేరుగా కనిపించని విధంగా మంచం ఏర్పాటు చేసుకోవాలి. అవసరం అయితే బెడ్ రూమ్ ని కర్టెన్లతో కవర్ చేసుకోవచ్చు.

పడకగదికి ఒకటి కంటే ఎక్కువ ద్వారం ఉండకూడదు. ఉంటే, వాటిని మూసి ఉంచండి. ఎవరి బెడ్‌రూమ్‌లోనైనా అటాచ్డ్ బాత్‌రూమ్ కలిగి ఉంటె.. ఆ బాత్ రూమ్ తలుపులను ఎల్లప్పుడూ మూసి ఉంచండి. లేదంటే గదిలో ప్రతికూలత పెరుగుతుంది, దీంతో అనవసరమైన తగాదాలు పెరుగుతాయి. అంతేకాదు మీ మంచం కింద ఎప్పుడూ ఎటువంటి వస్తువులను పెట్టవద్దు..

ఇంట్లో శక్తి ప్రవాహానికి ప్రధాన ద్వారం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంట్లోకి వెళ్లాలి. అంతేకాదు ద్వారం దగ్గర స్థలం ఎప్పుడూ మురికిగా ఉండకుండా చూసుకోండి. అంతేకాదు ప్రధాన ద్వారం చుట్టూ చెత్తకుండీలు లేకుండా చూసుకోండి. లేదంటే... ఇంటి సభ్యుల మధ్య సంబంధాలు చెడి.. అనవసరమైన గొడవలు మొదలవుతాయి.




