- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: Keeping crystal ball at home will change your luck, know its benefits in telugu
Vastu Tips: మీకు లక్‌ని తెచ్చే క్రిస్టల్ బాల్‌ని ఇంట్లో వాస్తు ప్రకారం ఏ ప్లేస్‌లో పెట్టుకోవాలంటే..
Vastu Tips: ఇంట్లో క్రిస్టల్ బాల్ ని కొంతమంది అందంకోసం పెట్టుకుంటే.. మరికొందరు శుభాన్ని సంతోషాన్ని ఇస్తుందని పెట్టుకుంటారు. అయితే వాస్తుప్రకారంఇంట్లో క్రిస్టల్ ని పెట్టుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అయితే క్రిస్టల్స్ ను తూర్పు దిశలోనే పెట్టుకోవాలని. ఈరోజు క్రిస్టల్ ఇచ్చే ప్రయోజనాలను తెలుసుకుందాం.
Updated on: Dec 29, 2021 | 3:17 PM

ఇంట్లో పెద్దలు, చిన్నవాళ్ల మధ్య ప్రేమ. అవగాహన పెరుగుతుందని.. కుటుంబంలో సామరస్యం ఉంటుందని నమ్మకం. అంతేకాదు అటువంటి ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. అయితే రోజూ గొడవలు, చికాకులు ఉండే ఇంట్లో మాత్రం కొన్ని ఇబ్బందులను తెస్తోందట

అయితే చికాకులు, సమస్యలు ఉన్న ఇంట్లో వాటిని నివారించడానికి, కుటుంబంలో పరస్పర అవగాహనను ఏర్పరచుకోవడానికి క్రిస్టల్ బాల్ మంచి సహాయకారిగా నిలుస్తుంది. ఇంటి గదిలో లేదా హాల్లో తూర్పు దిశలో క్రిస్టల్ బాల్ ఉంచండి. సూర్యకాంతి నేరుగా మీ ఇంట్లోకి వచ్చే దిశలో ఉంచండి. ఆ కాంతి నేరుగా క్రిస్టల్ బాల్‌పై పడేలా ఉంచండి.

అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారానికి క్రిస్టల్ బాల్‌ను వేలాడదీయవచ్చు. క్రిస్టల్ బాల్ తన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. అంతేకాదు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

ఎవరి ఇంట్లోనైనా భాగస్వామితో విభేదాలు ఉంటే.. అటువంటి వారు తమ పడకగదిలో క్రిస్టల్ బాల్‌ను పెట్టుకోవాలి. దానిని రోజుకు మూడు సార్లు సవ్యదిశలో తిప్పండి. ఇది మళ్ళీ జీవిత భాగస్వామితో అనుకూల వాతావరణనాన్ని ఏర్పరుస్తుంది.

మీరు పిల్లల చదుకునే గదిలో క్రిస్టల్ బాల్స్ ఉంచండి. ఇది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది. పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటారు.




