Viral Video: వృద్ధురాలికి తినిపిస్తూ.. ఓ వ్యక్తి చేసిన చిలిపిపని.. పాఠం నేర్చిన పెంపుడు కుక్క వీడియో వైరల్

Viral Video: మనిషికంటే కూడా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు. శునకం తన యజమాని పట్ల చూసే ప్రేమ, విశ్వాసాన్ని అనేక సార్లు వార్తల్లో విన్నాం.. పలు వీడియోల్లో చూస్తున్నాం..  కుక్క చేసే పనులు ... ఫన్నీ..

Viral Video:  వృద్ధురాలికి తినిపిస్తూ.. ఓ వ్యక్తి చేసిన చిలిపిపని.. పాఠం నేర్చిన పెంపుడు కుక్క వీడియో వైరల్
Viral Video
Follow us

|

Updated on: Dec 30, 2021 | 11:17 AM

Viral Video: మనిషికంటే కూడా కుక్కకు విశ్వాసం ఎక్కువ అని అంటారు. శునకం తన యజమాని పట్ల చూసే ప్రేమ, విశ్వాసాన్ని అనేక సార్లు వార్తల్లో విన్నాం.. పలు వీడియోల్లో చూస్తున్నాం..  కుక్క చేసే పనులు … ఫన్నీ వీడియోలు నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుంటాయి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు.. తాజాగా పెంపుడు కుక్కకు సంబంధించిన ఓ ఫానీ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ యువకుడు వృద్ధురాలైన తన తల్లికి తినిపిస్తూ.. చిలిపి పని చేస్తుంటే… కుక్క అతనిని కొడుతూ.. బుద్ధి చెప్పడం ఈ వీడియోలో కనిపిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో..  సోఫాలో ఒక పెంపుడు కుక్క , ఒక వృద్ధ మహిళ కూర్చుని ఉన్నారు. అంతేకాదు వీరికి ఎదురుగా ఓ యువకుడు పెద్ద గిన్నెలో పండ్ల ముక్కలను పట్టుకుని కనిపిస్తున్నాడు.  ఆ యువకుడు పండ్ల ముక్కను పోర్క్ తో పట్టుకుని కుక్కకు తినిపించాడు ప్రయత్నిస్తుంటే.. కుక్క తినడానికి ఆసక్తిని చూపించకుండా తల పక్కకు తిప్పుకుంటుంది. దీంతో ఆ వ్యక్తి.. పండ్ల ముక్క ఉన్న ఫోర్క్ ని వృద్ధ మహిళకు తినిపించాడు నోటి దగ్గరకు తీస్కుని వెళ్ళాడు… ఆ మహిళ పండ్ల ముక్కని తినడానికి నోరు తెరిచిన వెంటనే.. పోర్క్ ని వెనక్కి లాక్కుని .. చిలిపిగా తనే తినేశాడు.. అయితే ఆ వ్యక్తి చేసిన పని తర్వాత కుక్క స్పందించిన తీరు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.. మనసుని హత్తుకుంది.

తన యజమనురాలికి తినిపించకుండా ఆ వ్యక్తి తినేశాడన్న కోపంతో కుక్క అతనిని తన ముందు కాళ్లతో కొట్టింది..  ఈ వీడియో చూసిన వారు జంతువులకు కూడా మనుషులతో సమానమైన భావాలు ఉంటాయని అంటున్నారు. ఈ వీడియో క్యాట్స్‌విడాగ్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. డిసెంబర్ 19న షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు 94 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

Also Read:  సీజ్ చేసిన థియేటర్స్‌ను ఓపెన్ చేసుకోవడానికి అనుమతిచ్చిన సర్కార్.. కండిషన్స్ అప్లై..