AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు.. కరోనా నిబంధనలతో పనులు పూర్తి చేయాలని సూచన..

Medaram Jatara: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం..

Medaram Jatara: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు.. కరోనా నిబంధనలతో పనులు పూర్తి చేయాలని సూచన..
Medaram Jataara 2022
Surya Kala
|

Updated on: Dec 30, 2021 | 4:18 PM

Share

Medaram Jatara: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన మహా సమ్మేళం మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం జాతర 2022 ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది, తాజాగా మేడారంలో జరుగుతున్న ఏర్పాట్లను అటవీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప‌రిశీలించారు. జంపన్న వాగు వ‌ద్ద నిర్మించిన‌ స్నానఘట్టాలను, షేడ్లను, ఇత‌ర ప‌నుల‌ను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకున్నారు. మేడారం జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర పనులను ముమ్మరం చేయాలని సూచించారు.

ప్రణాళిక బద్ధంగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలి..  గ‌తంలో కంటే మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు మంత్రులు. గతంలో వచ్చిన ఇబ్బందులను బేరీజు వేసుకుని, వాటిని ఈసారి అధిగమించేలా చూడాలని తెలిపారు. తాగునీటి, పారిశుద్ధ్యం, వసతి, ఇతర సొకర్యాలపై దృష్టి సారించాలి సామాన్య భక్తుల క్యూ లైన్లు, భారీకెడ్లు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మంత్రులు. కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్ లు వ్యాప్తి చెందకుండా భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా చూడాలి. జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు తాగు నీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని తెలిపారు. స్నాన ఘ‌ట్టాల వ‌ద్ద త‌గిన ఏర్పాట్లు చేయాలి… ర‌హ‌దారుకిరువైపుల ఆర్ అండ్ బీ అధికారులు సూచిక బోర్డుల‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

భ‌క్తుల ర‌ధ్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలి… పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు త‌గిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పోలీసు ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో జాతరను పర్యవేక్షించాలి.. మన ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో… జాతరకు వచ్చే భక్తులకు అలాంటి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. జాతర అనంతరం చెత్త తొలగింపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. జనవరి 15 లోగా పనులు పూర్తి అయ్యేలా ఆధికారులు పని చేయాలన్నారు మంత్రులు సత్యవతి రాధోడ్, ఇంద్రకరణ్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్, ఇత‌ర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Also Read:  ఆ దేశంలో జీరో కోవిడ్ పాలసీ.. నిబంధనలు ఉల్లంగిస్తే అవమాన పడేలా వీధుల్లో ఉరేగింపు సహా అనేక శిక్షలు..