Astro Tips: ఇంట్లో వివాదాలు, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయా.. అయితే ఈ రెమిడీస్ పాటించి చూడండి
Astro Tips: జీవితం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా.. కష్టాల నుంచి ఈజీగా గట్టెక్కాలంటే కొన్ని సార్లు జ్యోతిష్యులు చెప్పిన పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడు జీవితం ఎల్లప్పుడూ..
Astro Tips: జీవితం ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలన్నా.. కష్టాల నుంచి ఈజీగా గట్టెక్కాలంటే కొన్ని సార్లు జ్యోతిష్యులు చెప్పిన పరిహారాలను పాటించాల్సి ఉంటుంది. అప్పుడు జీవితం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా కొందమంది చెడు దృష్టి నుంచి మీ ఇంటిని రక్షించడానికి కొన్ని చర్యలను సూచిస్తున్నారు. అవి అనుసరించడం చాలా సులభం. వీటిని పాటించడం వలన జీవితం ఆనందం, సంతోషం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. ఈరోజు జ్యోతిష్య పరిష్కారాల గురించి తెలుసుకుందాం..
లక్కీ ట్రీ: లక్కీ ట్రీ అంటే వెదురు మొక్క. ఈ వెదురు మొక్క ఇంట్లో ఉంటె చేదు దృష్టి నుంచి దూరంగా ఉంచుతుందని నమ్మకం. ముఖ్యంగా వెదురు మొక్కను తూర్పు దిక్కున పెట్టడం వలన సంపద, అదృష్టం పొందుతారని నమ్మకం. ఇండోర్ వెదురు మొక్కను ఒక గాజు పాత్రలో ఉంచాలి. వెదురు మొక్క ఎయిర్ ప్యూరిఫైయర్. దీనిని సులభంగా పెంచుకోవచ్చు. అయితే ఏ ఇండోర్ ప్లాంట్ కు నేరుగా సూర్యరశ్మికి తగలకూడదు.
నల్ల మిరియాలు లేదా ఎండు మిర్చి:
ఇంట్లో ఆనందం లోపించినా.. తరచుగా ఏపని మొదలు పెట్టినా అడ్డంకి ఏర్పడుతున్న వాటిని తొలగించుకోవడానికి నల్ల మిరియాలు లేదా ఎండు మిర్చి బెస్ట్ రెమెడీ. ఐదు ఎండుమిర్చిలను తీసుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పుకోవాలి. అనంతరం వాటిని తలపై కొట్టిన తర్వాత ఎవరు తిరగని ఏకాంత ప్రదేశంలో నాలుగు దిక్కులకు విసిరివేయాలి. ఐదవ మిర్చిని పైకి విసిరి.. వెనక్కి తిరగకుండా.. నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి రావాలి.
ఉప్పు: ఇంటి మూలల్లో ఉప్పు చల్లడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్మకం. అంతే కాదు, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కళ్ళ ఉప్పుని ఉంచడం వల్ల ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. ఉప్పు చెడు దృష్టి నుంచి బయటపడేస్తుందని విశ్వాసం.
తెలుపు కొవ్వొత్తులు: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. తెల్ల కొవ్వొత్తులు ప్రతికూల శక్తిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు ఇంట్లో సానుకూల శక్తిని తెస్తాయి. అయితే వాస్తు ప్రకారం కొవ్వొత్తులను ఇంట్లో పెట్టుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటికి తూర్పు న ఈశాన్య దిశలో కొవ్వొత్తి వెలిగించడం ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది.
Also Read: మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు.. కరోనా నిబంధనలతో పనులు పూర్తి చేయాలని సూచన..