AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year 2022 Vastu Tips: ఈ కొత్త సంవత్సరాన్ని ఇలా ఆహ్వానించండి.. ఇలా చేస్తే లక్ మీ వెంటే..

021కి వీడ్కోలు చెప్పడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితిలో 2022 లో జీవితంలో ప్రతిదీ శుభప్రదంగా ఉండాలని కోరకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 2022 కొత్త సంవత్సరం రాకకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన..

New Year 2022 Vastu Tips: ఈ కొత్త సంవత్సరాన్ని ఇలా ఆహ్వానించండి.. ఇలా చేస్తే లక్ మీ వెంటే..
New Year 2022 Vastu Tips
Sanjay Kasula
|

Updated on: Dec 30, 2021 | 8:04 PM

Share

2021కి వీడ్కోలు చెప్పడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితిలో 2022 లో జీవితంలో ప్రతిదీ శుభప్రదంగా ఉండాలని కోరకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 2022 కొత్త సంవత్సరం రాకకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అటువంటి పరిస్థితిలో మీరు కూడా 2022లో అంతా మెరుగ్గా ఉండాలంటే  కొన్ని వాస్తు చిట్కాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం.. రాబోయే కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు చాలా శుభప్రదంగా భావించే కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకురండి. వాటి వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ప్రతికూలతకు బదులుగా సానుకూలత ఏర్పడుతుంది.

నెమలి ఈక

శ్రీకృష్ణుని నెమలి ఈక అంటే చాలా ప్రీతికరమైనది. ఇలాంటి పరిస్థితుల్లో నెమలి ఈకలను ఇంట్లో ఉంచితే లక్ష్మి దేవి నిత్యం మీ ఇంట్లోనే నిలిచి ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందం , శ్రేయస్సు తీసుకురావాలంటే ఇంట్లో నెమలి ఈకను పెట్టుకోండి.

తులసి మొక్క

సనాతన ధర్మంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పచ్చని తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ దేనికీ లోటు ఉండదని.. ఆ ఇల్లు ధన, ధాన్యాలతో నిండుతుందని నమ్ముతారు. మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే.. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో ఇంట్లోకి తులసి మొక్కను తీసుకురండి.

వెండి ఏనుగు

ఈ కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు మీరు ఇంట్లోకి వెండి ఏనుగును తెచ్చుకోండి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. వెండి ఏనుగు అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలా ఉంచుకోవడం వల్ల రాహు, కేతువుల దుష్ఫలితాలు తొలగిపోయి వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి లభిస్తుంది.

మెటల్ తాబేలు

కొత్త సంవత్సరానికి ముందు మీ ఇంటికి మెటల్ తాబేలును తీసుకురండి. తరచుగా ప్రజలు చిన్న తాబేలు మట్టి లేదా కలపను తెచ్చి ఇంట్లో ఎక్కడైనా ఉంచినట్లైతే అది మంచిది కాదు. వెండి, ఇత్తడి లేదా కంచు లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకుంటే చాలా శుభప్రదం. ఇంట్లోకి తీసుకొచ్చిన తాబేలును ఉత్తర దిశలో ఉంచడం. దీని వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అమ్మ లక్ష్మిని అనుగ్రహిస్తుంది.

చిన్న కొబ్బరి

మీరు రెండు చిన్న కొబ్బరికాయలను ఇంటికి తీసుకువచ్చి.. దానిని ఒక గుడ్డలో చుట్టి, సురక్షితంగా ఉంచండి. దీపావళి రెండవ రోజున దానిని బయటకు తీసి నదిలో లేదా చెరువులో వదిలివేయండి. ఇలా చేస్తే లక్ష్మి మీ ఇంట్లో ఎక్కువ కాలం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. రెండవ కొబ్బరికాయను నిమజ్జనం చేసిన తర్వాత ఖజానాలో ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి: Egg Kebab Recipe: మీకు ఎగ్ అంటే ఇష్టమా.. న్యూ ఇయర్ వేడుకల కోసం అదిరిపోయే రెసిపీ..

Somu Veerraju: దేశ ద్రోహులపేర్లను తొలిగించండి.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెంట్స్

Follow Us
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..
కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..