- Telugu News Spiritual Vastu Tips To make the new year better and progress remove these broken things from the house here is the details
Vastu Tips: కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే, వీటిని మీ ఇంట్లోంచి పడేయండి..!
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం, విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచడం అశుభం. వాటి వల్ల కుటుంబ సభ్యులపై చెడు ప్రభావం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Updated on: Dec 30, 2021 | 10:54 PM

మరొక్క రోజు గడిస్తే 2021 ముగిసి.. 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలో అంతా మంచే జరుగాలని ప్రతీ ఒక్కరూ ఆశిస్తారు. అయితే, కొన్నిసార్లు కొన్ని విషయాలు ఆ అదృష్టానికి అవరోధంగా పరిణమిస్తాయి. అలాంటి అవరోధాలను ఎదుర్కోవటానికి జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని వాస్తు నివారణలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త సంవత్సరంలో చాలా మంది తమ ఇళ్లలోకి కొత్త వస్తువులను తప్పకుండా తీసుకువస్తారు. అయితే, అదే సమయంలో పాత, విరిగిపోయిన వస్తువులను ఇంట్లో అస్సలు ఉంచకూడదు.

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉన్న పా కొత్త సంవత్సరంలో ఇంటి నుండి బయట పడేయాల్సిన వాటి గురించి తెలుసుకుందా. అలా చేస్తే నూతన సంవత్సరంలో మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది.

పగిలిన గాజులు, పాత పాత్రలు, పాడైపోయిన గడియారం, విరిగిన దేవుని విగ్రహం, విరిగిన ఫర్నిచర్, కరాబైన ఎలక్ట్రానిక్ వస్తువులు, విరిగిన తలుపు ఇవన్నీ ఆర్థికంగా పరిస్థితిని దిగజారుస్తాయి. కుటుంబంలో కలహాలు, మానసిక ఒత్తిడిలు కలుగజేస్తాయి.

అంతే కాదు ఇది భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులన్నింటిని ఇంట్లో నుండి బయటకు తీయడం ద్వారా, లక్ష్మి దేవి మీ ఇంటికి వస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి వెల్లువిరుస్తుంది.
