Corona Virus: అక్కడ కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన శిక్షలు.. వీధుల్లో ఉరేగింపు సహా..

China Corona Virus: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ నివారణ కోసం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.  అయితే కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి చైనా కఠిన శిక్షలు విధిస్తోంది.  తాజాగా కరోనా నిబంధనలను..

Corona Virus: అక్కడ కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన శిక్షలు.. వీధుల్లో ఉరేగింపు సహా..
China Corona Virus
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2021 | 6:02 PM

China Corona Virus: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో కోవిడ్ నివారణ కోసం నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది.  అయితే కరోనా నిబంధనలు అతిక్రమించిన వారికి చైనా కఠిన శిక్షలు విధిస్తోంది.  తాజాగా కరోనా నిబంధనలను ఉల్లగించిన వ్యక్తులకు విధించిన బహిరంగ శిక్షలు ప్రముఖ వార్తల్లో చోటు చేసుకున్నాయి. చైనా కరోనా నిబంధనలను (చైనా షేమింగ్ కోవిడ్ రూల్స్ బ్రేకర్) ఉల్లంఘిస్తున్న వ్యక్తులు బహిరంగంగా శిక్షలు విధిస్తు.. వారు సిగ్గుపడేలా చేస్తోంది. తాజాగా  చైనాలోని గ్వాంగ్జీలో కరోనా నిబంధనలను పాటించని నలుగురు వ్యక్తులను అధికారులు అవమానపడేలా శిక్షలు విధించారు. ప్రస్తుతం ఈ వీడియో బహిర్గతం కావడంతో.. వెలుగులోకి వచ్చింది. చైనా వియత్నాం మూసివేసిన సరిహద్దుల వద్ద ఈ నలుగురు వ్యక్తులు వలసదారులకు సహాయం చేసి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని తెలుస్తోంది.

ప్ల కార్డులతో ఉరేగింపు 

తెల్లటి సూట్లు ధరించిన నలుగురు పురుషులను గ్వాంగ్జీలోని జింగ్సీ నగరం చుట్టూ ఊరేగించారు. ఈ సమయంలో భారీగా ప్రజలు, పోలీసులు కూడా ఉన్నారు. ఈ నలుగురు వ్యక్తులు చిత్రాలు, పేర్లతో కూడిన ప్లకార్డులు పట్టుకుని కనిపించారు. కవాతు చేస్తున్న వీరితో పాటు ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. చైనాలో కఠినమైన కోవిడ్ చట్టాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ కంటే తమ పొరుగు దేశాల సరిహద్దులను మూసివేసింది. చైనా జింగ్సీ నగరం వియత్నాంతో సరిహద్దుగా ఉంది. అయితే ఈ సరిహద్దు ప్రాంతాల్లో కరోనా నిబంధనలను ఎవరు ఉల్లగించినా ఇలా శిక్షకు గురవుతారని..ప్ల కార్డులు పట్టుకుని పరేడ్ చేయాల్సి ఉంటుందని..  స్థానికుల హెచ్చరించినట్లు ప్రాంతీయ వార్తా ఛానెల్ తెలిపింది.

 శీతాకాల ఒలింపిక్స్

జియాన్‌లో 162 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి చైనా  దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. తమ దేశాన్ని కోవిడ్ రహితంగా మార్చడానికి కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తోంది. ఈ కొత్త నిబంధనలకు కారణం త్వరలో జరగనున్న వింటర్ ఒలింపిక్స్  అని నివేదికలు చెబుతున్నాయి. ఫిబ్రవరిలో శీతాకాల ఒలింపిక్స్ ను నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానికంగా కరోనా కేసులు పెరిగితే,, నిర్వహణ విషయంపై సందిగ్ధం ఏర్పడే అవకాశం ఉంది.  .

నిబంధనలు ఉల్లంఘింస్తే జైలు, జరిమానా

అయితే ప్రపంచంలో వేగంగా వ్యాపిస్తున్న ఓమిక్రాన్ వేరియంట్  ఒక్క కేసు కూడా ఇప్పటివరకు చైనాలో నమోదు కాలేదు.  అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి సహాయం చేస్తేనే వాహనాలను రోడ్లపైకి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. స్థానిక ఆరోగ్య అధికారులు, పోలీసులు అన్ని కార్లను పర్యవేక్షిస్తున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10 రోజుల జైలు శిక్షతోపాటు రూ.5800 జరిమానాను శిక్షలుగా విధిస్తున్నారు. అంతేకాదు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం కోరుతుంది. అవసరమైన పనుల కోసం వెళ్లాల్సిన వ్యక్తులు మాత్రమే జియాన్‌లో ప్రయాణించాలని ఆదేశాలను  జారీ చేసింది.

Also Read:  థియేటర్స్ విషయంలో అందరికి మేలు చేసేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలంటున్న ఆర్ నారాయణ మూర్తి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.