AP Theater Issue: థియేటర్ల సీజ్ వ్యవహారంలో మంత్రి పేర్ని నానితో నటుడు నారాయణ మూర్తి చర్చలు..
AP Theater Issue: కృష్ణ జిల్లా మచిలీ పట్నంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో విప్లవ్ నటుడు ఆర్.నారాయణ మూర్తి సహా పలువురు థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని..
AP Theater Issue: కృష్ణ జిల్లా మచిలీ పట్నంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో విప్లవ్ నటుడు ఆర్.నారాయణ మూర్తి సహా పలువురు థియేటర్ యజమానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. సినిమా థియేటర్లపై పూర్తి అధికారం జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఉందని చెప్పారు. అసలు లైసెన్స్ లు లేకుండా ధియేటర్లు నడపడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. తాను సినిమా థియేటర్ ఓనర్స్ కు మూడు నెలల క్రితమే రెన్యువల్ చేసుకోవాలని చెప్పానని గుర్తు చేశారు. అనుకోనిది ఏదైనా జరిగితే ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని అన్నారు. సీజ్ చేసిన థియేటర్ ఓనర్స్ జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తారని మంత్రి పేర్ని నాని చెప్పారు.
సినీ నటుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి స్పందిస్తూ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మనుగడ కోసం ఏది మంచి అయితే అది చేయమని తాను మంత్రి పేర్ని నానిని కోరినట్లు చెప్పారు. అంతేకాదు తాను చేస్తోన్న విజ్ఞప్తిని సీఎం జగన్ దగ్గరకు తీసుకుని వెళ్ళమని చెప్పానన్నారు నారాయణ మూర్తి. సినిమా తీసేవాళ్లు, సినిమా చూపించేవాళ్లు, చూసేవాళ్లు కూడా బాగుండాలి.. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని అన్నారు.
సమస్య పరిష్కారం కోసం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని, ఫిల్మ్ చాంబర్ ని,మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను, సినీ పెద్దలను కలిసి కూర్చోబెట్టాలన్నారు. అందరూ ఒకేసారి సీఎంను కలిసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నాని కి విజ్జప్తి చేసినట్లు చెప్పారు. ఎవరికి ఏం కావాలో తెలుసుకుని ఓ నిర్ణయం తీసుకోవాలని.. వ్యక్తిగత ఆరోపణలకు పోకుండా ప్రేక్షకుల బాగు కోసం ఆలోచించాలన్నారు విప్లవ నటుడు. ఏపీ ప్రభుత్వం.. పరిశ్రమ ఒకరికొకరు పాజిటివ్ దృక్పదంతో ఉండాలని.. సినీ పరిశ్రమ బతకాలి…ధియేటర్ బతకాలన్నారు. అందరికి మేలు చేసేలా సీఎం జగన్ మంచి నిర్ణయం తీసుకోవాలని తాను కోరుతున్నట్లు ఆర్ నారాయణ మూర్తి చెప్పారు.
Also Read: ఆంధ్రా అబ్బాయిలు..విదేశీ అమ్మాయిలు.. వేదమంత్రాలు..అగ్ని సాక్షిగా వివాహ వేడుక..