AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: వంగవీటి రాధా ఆఫీస్‌ ముందు కలకలం.. అనుమానాస్పందంగా స్కూటీ.. రంగంలోకి ఇంటెలిజెన్స్‌

వంగవీటి రాధా ఆఫీస్‌ ముందు కలకలం చెలరేగింది. కొన్ని రోజులుగా ఆఫీసు ముందు అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉంది.

Vijayawada: వంగవీటి రాధా ఆఫీస్‌ ముందు కలకలం.. అనుమానాస్పందంగా స్కూటీ.. రంగంలోకి ఇంటెలిజెన్స్‌
Vangaveeti Radha
Ram Naramaneni
|

Updated on: Dec 30, 2021 | 2:13 PM

Share

వంగవీటి రాధా ఆఫీస్‌ ముందు కలకలం చెలరేగింది. కొన్ని రోజులుగా ఆఫీసు ముందు అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉంది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఇటు రాధా కార్యాలయాన్ని ఇంటెలిజెన్స్‌, ఎస్‌బీ పోలీసులు పరిశీలించారు. రాధా కార్యాలయం దగ్గర వివరాలు సేకరించారు. స్కూటీ నాని అనే వ్యక్తిదిగా గుర్తించారు.  రాధా కార్యాలయం పక్కన స్వీట్ షాపులో పనిచేసే వ్యక్తి స్నేహితుడిగా ఐడెంటిఫై చేశారు. వాహన పత్రాలు చూపించి స్కూటీ తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు.

తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని ఇటీవల రాధా వ్యాఖ్యానించడంతో బెజవాడ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారాయి. వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. దేవినేని అవినాష్, అరవ సత్యం కలిసి రాధా హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్. అయితే, ఆ కుట్రలతో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదంటున్నాడు అరవ సత్యం కుమారుడు తేజ.

రాధా రెక్కీ కామెంట్స్‌పై రాజకీయం హీటెక్కిపోతుంటే, పోలీసులు తమ పని తాము సైలెంట్‌గా చేసుకుపోతున్నారు. కుట్ర చేసిందెవరు? రెక్కీ నిర్వహించిందెవరు? అనే కోణంలో జెట్‌ స్పీడ్‌లో దర్యాప్తు చేస్తున్నారు. రెక్కీపై రాధాకృష్ణ నుంచి సమాచారం తీసుకున్నపోలీసులు..హత్యకు కుట్రపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

వంగవీటి రాధపై రెక్కీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాధాకృష్ణ తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని పంపించడం కూడా రాజకీయ రచ్చకు దారి తీసింది. మరోవైపు, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా రాధా పర్యటనలు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి, బెజవాడ రాజకీయాల్లో మంట రాజేసిన రాధా రెక్కీ కామెంట్స్‌ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్నది ఉత్కంఠగా మారింది.

Also Read: Viral: టెన్త్ క్లాస్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ లేడీ టీచర్.. చివరకు ఏం జరిగిందంటే..?

Telangana: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల కట్టలు.. ఆ జిల్లాలో కలకలం.. ఆరా తీయగా

మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే