Sealand smallest: సముద్రంలో రెండు స్తంభాలు.. వాటిపై ఏకంగా ఓ దేశమే నివాసం..! (వీడియో)
ప్రపంచంలో అతి పెద్ద దేశాలు చాలానే ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రపంచంలోనే అతి చిన్నదేశం కూడా ఉంది. ఇది సీలాండి. దీనిని మైక్రోనేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ 50 మంది కూడా జీవించడం లేదు. ప్రపంచంలోనే ఇదే అతి చిన్న దేశం.
ప్రపంచంలో అతి పెద్ద దేశాలు చాలానే ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ప్రపంచంలోనే అతి చిన్నదేశం కూడా ఉంది. ఇది సీలాండి. దీనిని మైక్రోనేషన్ అని పిలుస్తుంటారు. ఇక్కడ 50 మంది కూడా జీవించడం లేదు. ప్రపంచంలోనే ఇదే అతి చిన్న దేశం.సీలాండ్ ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ సముద్రతీరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సముద్రంపై రెండు స్తంభాలపై ఉంటుంది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్స్ నిర్మించారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అంతా వెళ్ళిపోయారు. సీలాండ్ వైశాల్యం కేవలం 250 మీటర్లు… అంటే పావు కిలోమీటరు మాత్రమే. దీనిని రఫ్ ఫోర్ట్ అని కూడా అంటారు. సీలాండ్ వేర్వేరు వ్యక్తులు ఆక్రమించారు. అక్టోబర్ 2012లో రాయ్ బేట్స్ అనే వ్యక్తి తనను తాను సీలాండ్ యువరాజుగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తరువాత అతని కుమారుడు మైఖేల్ ఈ దేశానికి రాజయ్యాడు.
ఇక్కడ జీవనోపాధి లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఇక్కడ కేవలం 27 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువే ఉంది. ఈ దేశం గురించి ఓ వెబ్‌సైట్ తయారు చేశారు. ఈ వెబ్ సైట్ ద్వారా ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్ చూడవచ్చు. ఫేస్ బుక్ లోనూ ఈ పేరుతో ఓ పేజీ ఉంది. ఈ దేశానికి సొంతంగా జాతీయ జెండా, జాతీయ గీతం, సొంత కరెన్సీ కూడా ఉంది. ఈ దేశం చాలా చిన్నది. దీనిని గూగుల్ మ్యాప్‌లో కనుగొనడం చాలా కష్టం. సీలాండ్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు రాలేదు. ఈ దేశం గురించి సెర్చ్ చేస్తే వాటికల్ సిటీ పేరు చూపిస్తుంది. వాటికన్ కొండపై ఉన్న దేశం వాటికన్ సిటీగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఇది అంతకుముందు ఇటలీ అధీనంలో ఉండేది. కానీ 1929లో స్వతంత్రంగా మారింది. 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశ జనాభా 800. ఇక్కడ ఇటాలియన్ భాష మాట్లాడతారు. యూరో కరెన్సీ ఉంటుంది. ఇక్కడ పోప్ పదవిలో ఉన్న వ్యక్తి చేతిలో అన్ని అధికారాలు ఉంటాయి. వాటికన్ సిటీ స్టేట్ కోసం పోంటిఫికల్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు పోప్ ను నియమిస్తుంది.