Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలలో కులం పేరుతో వేధింపులు.. ప్రిన్సిపల్‌ దారుణం..బాలికలతో బాత్‌రూమ్స్‌ క్లీనింగ్‌..(వీడియో)

Tamil Nadu: ప్రభుత్వ పాఠశాలలో కులం పేరుతో వేధింపులు.. ప్రిన్సిపల్‌ దారుణం..బాలికలతో బాత్‌రూమ్స్‌ క్లీనింగ్‌..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 30, 2021 | 6:07 PM

తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపల్‌.. కులం పేరుతో వారిని వేధింపులకు గురి చేశాడు..ఈ ఘటన తిరుప్పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.


తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ విద్యార్థుల పట్ల ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలకు దారితీసింది. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ప్రిన్సిపల్‌.. కులం పేరుతో వారిని వేధింపులకు గురి చేశాడు..ఈ ఘటన తిరుప్పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.తిరుప్పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల లో ప్రిన్సిపాల్ గా ఉన్న గీత..స్కూల్లోని బాలికల పట్ల అమానుషంగా ప్రవర్తించారు.. గత కొన్ని రోజులుగా స్కూల్ లోని టాయిలెట్స్‌ను విద్యార్థినులు కడుగుతుండడంపై అనుమానం వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఆరా తీయగా,అసలు విషయం బయటపడింది..దళితులు చదువుకోవడానికి పనికిరారు అని, మీకు చదువు ఎందుకని హింసించేవారట.. మీరు తక్కువ జాతి వారని ప్రిన్సిపాల్ గీత దుర్భాషలాడేవారని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించారు..ప్రిన్సిపల్‌ కు భయపడి మొదట్లో వీరు తల్లితండ్రులకు చెప్పకుండా విషయం దాచిపెట్టినట్లు తెసింది. తల్లితండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన అధికారులు, పాఠశాల లో జరుగుతున్న వాటిపై నేరుగా వెళ్లి విచారణ చేపట్టారు.. అగ్రవర్ణాలకు చెందిన ప్రిన్సిపాల్ గీత… స్కూల్ పిల్లలను కులం పేరుతో దూషించి వారిని హింసించేవారని విచారణ లో విద్యార్థులు చెప్పుకొచ్చారు.. కొంచెం విద్యార్థులతో మాట్లాడిన మీ జాతి ఇంతే , మీకు తల్లిదండ్రులు లేరని మీరు చదువుకొని ఏమి చేస్తారని తక్కువ చేసి మాట్లాడేవారని, మా చేతే మగవాళ్ల బాత్రూం లను కడిగించేవారంటూ అమ్మాయిలంతా కన్నీరు పెట్టుకున్నారు..ప్రిన్సిపాల్ గీత ని విధులనుండి తొలగిస్తున్నట్టు, ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.