Hugh Jackman: కరోనా భారిన పడ్డ స్టార్ హీరో.. త్వరగా కోలుకుంటా అంటూ పోస్ట్..
గత రెండేళ్లుగా కరోనా మహామ్మరి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో తీవ్రంగా ప్రాణనష్టం.. ఆస్తి నష్టం జరిగింది
గత రెండేళ్లుగా కరోనా మహామ్మరి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రభావంతో తీవ్రంగా ప్రాణనష్టం.. ఆస్తి నష్టం జరిగింది. ఈ మహమ్మారి వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతుంది. కరోనా వైరస్ అటు చిత్రపరిశ్రమ పై ఎక్కువగానే ప్రభావం చూపింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు కోలుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల పలువురు సెలబ్రెటీలు ఈ మహామ్మారి భారిన పడుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరో కోవిడ్ బారిన పడ్డారు. హాలీవుడ్ స్టార్ హీరో హ్యూ జాక్ మన్ కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని హ్యూ జాక్ మన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు.
ఈరోజు ఉదయం నేను కోవిడ్ పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. నాకు జలుబు, గొంతు నొప్పి లక్షణాలు ఉన్నాయి. కానీ నేను బాగానే ఉన్నాను. వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తాను. రివర్ సిటీ వేదికపై కచ్చితంగా కలుసుకుంటాను అంటూ హ్యూ జాక్ మన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. హ్యూ జాక్ మాన్ కరోనా బారిన పడడంతో అతను ప్రదర్శిస్తున్న ది మ్యూజిక్ మ్యాన్ షో జనవరి 1వరకు వాయిదా పడింది. జనవరి 2న వింటర్ గార్డెన్ థియేటర్ వేదికపైకి హ్యూ జాక్ మన్ రావాలని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
హాలీవుడ్ స్టార్ హ్యూ జాక్ మన్ దెయ్యాల కోట సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ప్రస్తుతం ఆయన బ్రాడ్ వేకు చెందన ది మ్యూజిక్ మ్యాన్ షోకి ప్రదర్శన ఇస్తున్నాడు.
View this post on Instagram
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్