Donald Trump: ట్రంప్ బాత్‌రూమ్‌లో అమెరికా కీలక రహస్య పత్రాలు.. దేశ భద్రతా రహస్యాలను ప్రైవేట్ వ్యక్తులకు చెప్పారనే అభియోగం
అధ్యక్ష పదవి నుంచి దిగిన తర్వాత కూడా ట్రంప్ ప్రపంచానికి చెమటలు పట్టిస్తున్నాడు..అమెరికా కీలక రహస్య పత్రాలను తీసుకెళ్లి బాత్‌రూమ్‌లో దాచుకున్నాడు. ఇదే ట్రంప్ మెడకు చుట్టుకుంటోంది.
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదవిలో ఉన్నా..లేకపోయినా..ఎప్పుడూ సెన్సేషనే..ఏదో ఒక ఇష్యూతో ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు. దేశ భద్రత, సైనిక రహస్యాలను ట్రంప్ ప్రైవేటు వ్యక్తులకు తెలియజేసినట్లు ఆయనపై అభియోగం మోపబడింది..అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆయన తన సొంత నివాసానికి దేశ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను తరలించుకుపోయారని అభియోగాల్లో అధికారులు వెల్లడించారు. ఇరాన్‌పై దాడికి సంబంధించిన సీక్రెట్ పేపర్స్‌తో పాటు..అమెరికా మిలిటరీకి చెందిన ఓ కీలక మ్యాప్‌ను ట్రంప్‌ను ఓ అనధీకృత వ్యక్తితో పంచుకున్నారట.
ఇక ఈ రహస్య పత్రాలను బాత్‌రూమ్‌లో పెట్టెల్లో దాచారని అధికారులు గుర్తించారు. అయితే వాటిని స్టోర్ రూమ్‌లో పెట్టినట్లు ట్రంప్ లాయర్లు వాదిస్తున్నారు. ట్రంప్ తీసుకెళ్లిన వేలాది రహస్య పత్రాల్లో కొన్నింటిని..ఇంట్లో ఎక్కడంటే అక్కడ చిందరవందరగా పడేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతటి రహస్య పత్రాలను తరలించడంలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని తెలిపారు. అమెరికా చరిత్రలో ఇలా ఫెడరల్ ప్రభుత్వ అభియోగాలు నమోదైన తొలి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కావడం విశేషం.. ఈ ఘటన ఆ దేశాన్ని అసాధారణమైన స్థితిలో ఉంచింది.
ట్రంప్‌కు సన్నిహితుడు ఒకరు ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్ చేశారు.. మంగళవారం మియామీలోని అధికారులకు ట్రంప్ స్వయంగా లొంగిపోయే అవకాశం ఉందని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు.
ప్రత్యేక న్యాయవాది జాక్ స్మిత్ కార్యాలయం దాఖలు చేసిన నేరారోపణ, న్యూయార్క్‌లోని స్థానిక ప్రాసిక్యూటర్లు 2016 కంటే ముందుగానే పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించిన కేసులో ట్రంప్‌పై 30 కంటే ఎక్కువ నేరారోపణలు నమోదు చేసిన రెండు నెలల తర్వాత వచ్చింది. ఎన్నికల.
2020లో ఎన్నికల ఓటమి తర్వాత అధికారాన్ని నిలుపుకోవడానికి ట్రంప్ చేసిన విస్తృత శ్రేణి ప్రయత్నాలను కూడా స్మిత్ పరిశీలిస్తున్నారు. ఆ ప్రయత్నాలు జనవరి 6, 2021న క్యాపిటల్‌పై ట్రంప్ అనుకూల గుంపు ఎలా దాడి చేసిందనే విషయంపై దృష్టి పెట్టారు. అయితే తనపై జరుగుతున్న దాడులపై ట్రంప్ స్పందిస్తూ.. ఈ దర్యాప్తు రాజకీయంగా ప్రేరేపించబడిన మంత్రగత్తె వేట అంటూ పదేపదే వర్ణించారు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..