STSS Outbreak: జపాన్‌ను వణికిస్తున్న ‘మాంసం తినే బ్యాక్టీరియా’.. 48 గంటల్లోనే మరణం! వేగంగా వ్యాప్తి..
నిన్నమొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ 19 నుంచి బయటపడి.. కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఇది సోకిన వారికి కేవలం 48 గంటల్లో ప్రాణాల్ని హరించేస్తుంది. ఈ వైరస్ మరణాలు తొలిసారి జపాన్‌లో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఈ బ్యాక్టీరియా మారణహోమం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య వెయ్యి..
టోక్యో, జూన్ 18: నిన్నమొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ 19 నుంచి బయటపడి.. కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతుంది. ఇది సోకిన వారికి కేవలం 48 గంటల్లో ప్రాణాల్ని హరించేస్తుంది. ఈ వైరస్ మరణాలు తొలిసారి జపాన్‌లో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అక్కడ ఈ బ్యాక్టీరియా మారణహోమం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య వెయ్యి దాటాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ను స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అని అంటారు. జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మార్చిలోనే ఈ వైరస్ కేసులు వేగంగా తమ దేశంలో పెరుగుతున్నట్లు ప్రకటించింది. జూన్ 2 నాటికి అక్కడ 977 కేసులు నమోదైనట్లు జాపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా గతేడాది ఆ దేశంలో 941 కేసులు నమోదయ్యాయి.
ఈ ఇన్ఫెక్షన్ బారీన పడిన వారిలో జ్వరం, చలి, కండరాల నొప్పులు, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ ఇన్ఫెక్షన్‌ను యూరప్‌లోని మరో ఐదు దేశాలలో కూడా గుర్తించారు. ఈ ఏడాది జపాన్‌లో 2,500 కొత్త కేసులు నమోదు కాగా, వారిలో 30 శాతం మంది మరణించారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో 24 నుంచి 48 గంటలలోపు రక్తపోటు గణనీయంగా పెరిగి, అవయవ వైఫల్యం, హృదయసృందన రేటు వేగవంతం కావడం, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలతో మరణం సంభవిస్తుంది. ప్రతి 10 మందిలో ముగ్గురు మరణిస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 65 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా దీని భారీన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
గ్రూప్ A స్ట్రెప్టోకోకస్‌కు చెందిన స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్ అనే బ్యాక్టీరియా పేగుల్లో విడుదల చేసిన ట్యాక్సిన్ల వల్ల STSS ఏర్పడుతుంది. ఇది శరీరంలోని మాంసం తినే ఇన్ఫెక్షన్‌గా మారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది వేగంగా ఇతరులకు వ్యాపించే అంటువ్యాధి. 2022 చివరి నుంచి.. యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్‌తో సహా పలు దేశాల్లో ఈ వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.