ఉత్తర కొరియాకు రష్యా అధ్యక్షులు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన నియంత కిమ్
రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం తెల్లవారుజామున ఉత్తర కొరియా చేరుకున్నారు. అక్కడ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్న కిమ్ అక్కడి నుంచి పుతిన్‌తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు.

రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం తెల్లవారుజామున ఉత్తర కొరియా చేరుకున్నారు. అక్కడ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. విమానాశ్రయంలో రిసీవ్ చేసుకున్న కిమ్ అక్కడి నుంచి పుతిన్‌తో కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ప్రపంచం మొత్తానికి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు నిద్రలేని రాత్రులు ఇస్తున్న పుతిన్.. అమెరికా ఆంక్షలను తొలగించేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని కాంక్షించారు.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్యోంగ్యాంగ్ విమానాశ్రయంలో పుతిన్‌కు స్వాగతం పలికారు. ఇరువురు దేశాధినేతలు కరచాలనం చేసి కౌగిలించుకున్నారని, తర్వాత కిమ్ పుతిన్‌తో కలిసి కారులో ఎక్కి ప్యోంగ్యాంగ్‌లోని కుమ్సుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారని ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రెండు దేశాల స్నేహం, ఐక్యత కోసం రెండు దేశాల మధ్య సమావేశాన్ని చారిత్రాత్మక సంఘటనగా న్యూస్ ఏజెన్సీ అభివర్ణించింది.
ఉత్తర కొరియా ప్రపంచంలోని ఇతర దేశాల నుండి ఒంటరిగా ఉన్న దేశం. 24 సంవత్సరాలలో రష్యా అధ్యక్షులు పుతిన్ మొదటిసారిగా కొరియా సందర్శించారు. విదేశీ నాయకులు ఇక్కడ చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి పరిస్థితిలో, పుతిన్ కొరియా పర్యటన ఒక పెద్ద సంచలనంగా మారింది. పుతిన్ రాక కోసం విస్తృతమైన సన్నాహాలు జరిగాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎయిర్‌పోర్టులో భారీ రెడ్ కార్పెట్‌లు వేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. కిమ్ రెడ్ కార్పెట్ మీద నిలబడి పుతిన్ కోసం ఎదురు చూస్తున్నారు. పుతిన్ తన విమానం మెట్లు దిగిన వెంటనే, కిమ్ ముందుకు కదిలారు. అతనితో కరచాలనం చేశారు. ఇద్దరు నాయకులు చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది.
MASSIVE red carpet rolled out for Putin on arrival to North Korea pic.twitter.com/GOLkFpRqsx
— COMBATE |🇵🇷 (@upholdreality) June 18, 2024
అనంతరం పుతిన్, కిమ్‌ల కాన్వాయ్ పెద్ద సంఖ్యలో బైక్‌లను నడుపుతున్న భద్రతా బలగాల మధ్య ముందుకు కదిలింది. ఆకాశహర్మ్యాల మధ్య ఉన్న విశాలమైన రహదారిపై కాన్వాయ్ ప్రయాణిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ठीक 24 सालों बाद रूस के राष्ट्रपति पुतिन नार्थ कोरिया पहुँचे हैं. वहाँ के राष्ट्रपति किंम जोंग ने खुद एयरपोर्ट पर उनका स्वागत किया. पुतिन और किम मुलाक़ात ने दुनिया के कई देशों की नींद उड़ा दी है pic.twitter.com/xwgIyoysN4
— पंकज झा (@pankajjha_) June 19, 2024
24 ఏళ్ల తర్వాత పుతిన్ తొలిసారి ఉత్తర కొరియాలో పర్యటించారు. కిమ్‌తో భేటీ అనంతరం పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యకు ఉత్తర కొరియా మద్దతిస్తోందని, దానిని తాను అభినందిస్తున్నానన్నారు. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది. న్యాయాన్ని అడ్డుకునే పాశ్చాత్య ప్రయత్నాలను, సార్వభౌమాధికారం పట్ల పరస్పర గౌరవం, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ స్థాపనకు అడ్డుకట్ట వేసే పాశ్చాత్య ప్రయత్నాలను ఇరు దేశాలు గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉంటాయని పుతిన్ చెప్పారు. ఇక పర్యాటకం, సంస్కృతి, విద్య రంగాల్లో కూడా ఇరు దేశాలు తమ సహకారాన్ని పెంచుకుంటాయని పుతిన్
ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఆయుధాలను కొరియా సరఫరా చేస్తున్న తరుణంలో పుతిన్ ఉత్తర కొరియా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిగా, రష్యా అతనికి ఆర్థిక సహాయం, సాంకేతికతను బదిలీ చేస్తోంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే, కిమ్ తన అణు కార్యక్రమంలో ఉపయోగించవచ్చనే భయం ఉంది.
ఇదిలావుంటే, అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాల కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తర కొరియాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. అదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడి చేయడంతో అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించాయి. చెప్పారు.
2019లో రష్యాలో జరిగిన పుతిన్, కిమ్‌ల తొలి సమావేశం తర్వాత రెండు దేశాల మధ్య సైనిక, ఆర్థిక సంబంధాలు వేగంగా పెరిగాయని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్‌లో ఉపయోగించేందుకు రష్యాకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఉత్తర కొరియా అందజేస్తోందని అమెరికా, దక్షిణ కొరియాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను రష్యా, ఉత్తర కొరియాలు కొట్టిపారేశాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
