AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురు కావాలనే కోరికతో ఏకంగా 9 మంది కుమారులకు జన్మనిచ్చిన మహిళ.. పదో కాన్పులో కవలలు?!

ఇక్కడ ఒక మహిళ, కుమార్తె కావాలనే కోరికతో మొత్తం 9 మంది కుమారులకు జన్మనిచ్చింది. అయితే ఇంత జరిగినా ఆమె ఆగకపోవడంతో పదోసారి గర్భం దాల్చింది. ఆ మహిళ పదోసారి ప్రసవించడంతో ఆమె కోరిక నెరవేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పదోసారి మళ్లీ గర్భవతి కావడంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు. ఆమె తన పిల్లలను ఎలా చూసుకోగలుగుతుందని చాలా మంది విమర్శించారు. ఈ విషయమై చాలా మంది యలాన్సియాను ట్రోల్ చేసి ఆటపట్టించారు. దీనిపై స్పందించిన యలన్సియా ఓ వీడియోను షేర్ చేసింది.

కూతురు కావాలనే కోరికతో ఏకంగా 9 మంది కుమారులకు జన్మనిచ్చిన మహిళ.. పదో కాన్పులో కవలలు?!
Woman Want Daughter
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2024 | 9:55 PM

Share

భారతదేశం ప్రపంచంతో సమానంగా ఉన్నప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుట్టడం శాపంగా భావిస్తారు. ఆడపిల్ల పుడితే ముఖం చాటేసేవాళ్లు, కొడుకు పుడితే సంతోషించేవాళ్లు నేటికీ చాలా మంది ఉన్నారు. కొడుకు కావాలనే కోరికతో నలుగురైదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడపిల్లలకు జన్మనిచ్చే జంటలు కొందరు ఉన్నారు. అయితే, అలాంటి మహిళ ఒకరు, కుమార్తె కావాలనే కోరికతో ఏకంగా 9 మంది కొడుకులకు జన్మనిచ్చింది. తన కోరిక తీర్చుకునేందుకు పదోసారి గర్భవతి అయ్యారు. ఈ ఘటన మన దేశంలో జరిగింది కాదు. అగ్రరాజ్యం అమెరికాకు చెందినది. ఇక్కడ ఒక మహిళ, కుమార్తె కావాలనే కోరికతో మొత్తం 9 మంది కుమారులకు జన్మనిచ్చింది. అయితే ఇంత జరిగినా ఆమె ఆగకపోవడంతో పదోసారి గర్భం దాల్చింది. ఆ మహిళ పదోసారి ప్రసవించడంతో ఆమె కోరిక నెరవేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

యలాన్సియా రోసారియో అనే 31ఏళ్ల మహిళ పదవ సారి గర్భవతి అయినప్పుడు, ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు అమ్మాయి కాగా, మరొకరు అబ్బాయి. తనకు కూతురు లేకుంటే 11వ సారి గర్భం దాల్చేందుకు సిద్ధమయ్యేదానిని అంటూ యలాన్సియా చెబుతోంది. యలాన్సియా 18 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా కొడుకుకు జన్మనిచ్చింది. అతని వయస్సు ఇప్పుడు 13 సంవత్సరాలు. అయితే యలాన్సియా రొసారియో పదోసారి మళ్లీ గర్భవతి కావడంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు. ఆమె తన పిల్లలను ఎలా చూసుకోగలుగుతుందని చాలా మంది విమర్శించారు. ఈ విషయమై చాలా మంది యలాన్సియాను ట్రోల్ చేసి ఆటపట్టించారు. దీనిపై స్పందించిన యలన్సియా ఓ వీడియోను షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియోలో, యలాన్సియా భవిష్యత్తు కోసం తన ప్రణాళికలు ఏమిటో చెప్పింది. యలాన్సియా తన పిల్లలందరినీ వీడియోలో చూపించి భవిష్యత్తులో ఎవరు ఎలా అవుతారో చెప్పింది? ఒక కొడుకు పోలీస్ ఆఫీసర్ అవుతాడని, ఒకరు చెఫ్ అవుతారని, ఒకరు ఎడిటర్ అవుతారని, ఒకరు షాప్ నడుపుతారని యలాన్సియా వీడియోలో చెప్పింది. ప్రజలు తనను విమర్శించినా, ట్రోల్ చేసినా.. తనకు ఏది అనిపిస్తే అది చేస్తుందని యలాన్సియా ప్రజల పట్ల స్పందించిన తీరును బట్టి అర్థమవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..