Hajj Yatra: హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఎండ తీవ్రతకు 500 మందికి పైగా బలి..!

హజ్‌యాత్రలో మృత్యుఘోష..50 డిగ్రీల ఎండకు 500 మందికి పైగా బలి..! హజ్‌యాత్రలో ఎండ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా చనిపోయారు.

Hajj Yatra: హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఎండ తీవ్రతకు 500 మందికి పైగా బలి..!
Haj Pilgrims
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 19, 2024 | 10:50 AM

హజ్‌యాత్రలో మృత్యుఘోష..50 డిగ్రీల ఎండకు 500 మందికి పైగా బలి..! హజ్‌యాత్రలో ఎండ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 550 మందికి పైగా చనిపోయారు. మృతి చెందిన వారిలో ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నారు. సుమారు 323 మంది ఈజిప్టియన్లు ఉండగా..60 మంది జోర్డానియన్లు కూడా మ‌ర‌ణించారు. మొత్తంగా ఇప్పటివ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 577కి చేరిన‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం మ‌క్కాలో 50 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్రత‌లు న‌మోదవుతున్నాయి. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. వేడి సంబంధిత స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డిన సుమారు 2,000 మంది యాత్రికులకు చికిత్స అందిస్తున్నారు. గ‌తేడాది కూడా హ‌జ్ యాత్ర‌లో 240కి పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి.

మండిపోతున్న ఎండలతో హజ్ యాత్రికులు విలవిల్లాడుతున్నారు. ఏటా బక్రీద్ మాసంలో జరిగే ఈ యాత్రకు వివిధ దేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. అయితే ఈసారి మాత్రం సౌదీలో రికార్డు స్ధాయిలో 50 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండలకు వారంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హజ్ యాత్ర చేసే వారిలో వృద్ధులు, మధ్య వయస్సు వారు ఎక్కువ మంది ఉంటుంటారు. వీరంతా ఎండ ధాటికి తట్టుకోలేక చనిపోతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…