Australian Senator: తొలిసారిగా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా సెనేటర్

తొలిసారిగా ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన సెనేటర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కొత్త సెనేటర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. అస్ట్రేలియా పార్లమెంటులో ప్రమాణం చేసిన మొదటి వ్యక్తి ఘోష్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Australian Senator: తొలిసారిగా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆస్ట్రేలియా సెనేటర్
Australian Senator Varun Ghosh
Follow us

|

Updated on: Feb 07, 2024 | 10:46 AM

తొలిసారిగా ఆస్ట్రేలియాలోని భారతీయ సంతతికి చెందిన సెనేటర్ వరుణ్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో కొత్త సెనేటర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. అస్ట్రేలియా పార్లమెంటులో ప్రమాణం చేసిన మొదటి వ్యక్తి ఘోష్ కావడం విశేషం. ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఆరోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేయబోతున్న సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో వరుణ్ ఘోష్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఘోష్‌కు అభినందనలు తెలిపారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. “పశ్చిమ ఆస్ట్రేలియా నుండి మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొదటి ఆస్ట్రేలియా సెనేటర్ అంటూ పెన్నీ వాంగ్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు.

వెస్ట్రన్ ఆస్ట్రేలియా (WA)కి ప్రాతినిధ్యం వహించడానికి లేబర్ పార్టీ ఘోష్‌ని ఎంపిక చేసింది. ఇటీవలే ఫ్రాన్సిస్ బర్ట్ ఛాంబర్స్‌లో న్యాయవాది అయిన 38 ఏళ్ల ఘోష్ ప్రస్తుత సెనేటర్ పాట్రిక్ డాడ్సన్ స్థానంలో ఎంపికయ్యారు. సెనేటర్ ఘోష్ భగవద్గీతపై ప్రమాణం చేసిన మొట్టమొదటి ఆస్ట్రేలియా సెనేటర్. ఈ సందర్భంగా వరుణ్ ఘోష్ మాట్లాడుతూ, “నాణ్యమైన విద్య, శిక్షణ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని గట్టిగా నమ్ముతున్నాను. ఇందుకోసం శాయశక్తులా కృష్టి చేస్తా” అని చెప్పారు.

వరుణ్ ఘోష్ 17 సంవత్సరాల వయస్సులో పెర్త్‌లోని లేబర్ పార్టీలో చేరారు. భారతీయ-ఆస్ట్రేలియన్ బారిస్టర్ అయిన ఘోష్‌ను గత వారం లేబర్ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. ఫెడరల్ పార్లమెంట్ యొక్క సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సెనేటర్ వరుణ్ ఘోష్‌ను ఎన్నుకున్నాయి.

వరుణ్ ఘోష్ ఎవరు?

వరుణ్ ఘోష్ ఒక భారతీయ-అమెరికా బారిస్టర్. అతను 17 సంవత్సరాల వయస్సులో లేబర్ పార్టీలో చేరాడు. లేబర్ రైట్ ఫ్యాక్షన్ సభ్యుడుగా కొనసాగుతున్నారు. 1997లో భారతదేశం నుండి ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లి న్యూరాలజిస్టులుగా పనిచేయడం ప్రారంభించిన భారతీయ సంతతికి చెందిన తల్లిదండ్రుల కుమారుడు. అతను వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో కళలు, న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. తరువాత లా స్కాలర్‌షిప్‌పై కేంబ్రిడ్జ్‌లోని డార్విన్ కాలేజీలో చదివారు.

ఘోష్ పశ్చిమ ఆస్ట్రేలియాలో చట్టపరమైన విషయాలతో వ్యవహరించే వివిధ అంతర్జాతీయ న్యాయ సంస్థలలో పనిచేశారు. 2009లో మల్లెసన్స్ స్టీఫెన్ జాక్వెస్‌లో న్యాయవాదిగా చేరారు. ఆ తరువాత న్యూయార్క్ నగరంలో వైట్ & కేస్‌లో చేరారు. అక్కడ 2011 నుండి 2013 వరకు అసోసియేట్‌గా పనిచేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక సంస్థలు, దివాలా చట్ట విధానానికి సంబంధించి ప్రపంచ బ్యాంకుకు సలహాదారుగా కూడా ఉన్నారు.

2015లో, ఘోష్ ఆస్ట్రేలియాలోని ఒక సంస్థతో సీనియర్ అసోసియేట్‌గా పని చేయడం ప్రారంభించారు. వివాద పరిష్కారంలో బ్యాంకులు, వనరుల కంపెనీలు, నిర్మాణ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. 2018లో ఫ్రాన్సిస్ బర్ట్ ఛాంబర్స్‌లో ప్రైవేట్ ప్రాక్టీస్‌లో బారిస్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో అనుబంధ లెక్చరర్‌గా కూడా పనిచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో సెనేట్‌లో పాట్ డాడ్సన్ స్థానంలో ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ అభ్యర్థిగా ఘోష్ ఎంపికయ్యారు. ఫిబ్రవరి 1న జరిగిన సంయుక్త సమావేశంలో పశ్చిమ ఆస్ట్రేలియా పార్లమెంటు ద్వారా ఘోష్‌ను ఆస్ట్రేలియన్ సెనేటర్‌గా నియమించారు.

Latest Articles