Visa Free: పర్యాటకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఈ దేశంలో పర్యటించాలంటే వీసా అవసరం లేదు
ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ విహార యాత్రలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కాస్త సమయం దొరికిందంటే చాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక ఫారన్ ట్రిప్ వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అందులోనూ ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావంతో టూరిజంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఒక సర్వేలో కూడా వెల్లడైంది. ఇక సెలబ్రిటీలకు అయితే ఇలాంటి విదేశీ వెకేషన్లకు కొదవేలేదు.

ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరూ విహార యాత్రలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. కాస్త సమయం దొరికిందంటే చాలు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఏదో ఒక ఫారన్ ట్రిప్ వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అందులోనూ ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావంతో టూరిజంపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ఒక సర్వేలో కూడా వెల్లడైంది. ఇక సెలబ్రిటీలకు అయితే ఇలాంటి విదేశీ వెకేషన్లకు కొదవేలేదు. ఈ అవకాశాన్ని సామాన్యులకు కూడా అందిస్తూ సరికొత్త నిర్ణయం తీసుకుంది ఇరాన్.
తమ దేశానికి రావాలనుకునే వారికి వీసా అవసరం లేదని తాజాగా ఇరాన్ మంత్రి వర్గం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో తమ టూరిజంను పెంపొందించుకొని ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో శ్రీలంక తమ దేశాన్ని వీసా ఫ్రీ దేశంగా మార్చింది. ఆ తరువాత ఈ బాటలోకి మలేషియా, థాయిలాండ్, వియత్నాంలు వచ్చి చేరాయి. అయితే శాశ్వతంగా కాకుండా కొన్ని రోజుల పాటూ కొన్ని దేశాలకు మాత్రమే వీసా లేకుండా టూరిజం కోసం తమ దేశంలోకి అనుమతి ఇస్తున్నట్లు నిర్ణయాన్ని తీసుకుంది.
తాజాగా ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆ దేశ ప్రభుత్వం. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం మన దేశంతోపాటు మరో 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన ఇరాన్ మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇరాన్ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి ప్రకటించారు. ఇరాన్ అనగానే ఏదో తెలియని నెగిటివ్ ఇంపాక్ట్ ఇతర దేశాల వారిలో ఉందని.. ఇలాంటి వ్యతిరేక ప్రచారాన్ని స్వస్థి చెప్పేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది.
ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్‌తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ తీసుకున్న నిర్ణయం ద్వారా తమ దేశ టూరిజం మరింత పెరిగి ఆర్థికంగా శక్తి పుంజుకునే అవకాశం ఉంది. ఈ వీసా ఫ్రీ సదావకాశాన్ని ఎంత మంది భారతీయులు వినియోగించుకుంటారో వేచి చూడాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




