AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: ఆర్టికల్ 370 రద్దుపై పాక్ ప్రధాని నిరసన.. కశ్మీర్ ప్రజల కోసం 300 సార్లు యుద్ధం చేయడానికి రెడీ అంటూ..

ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ విషయంలో అసెంబ్లీలో పాక్ తాత్కాలిక  ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్‌ మాట్లాడుతూ మళ్లీ పాట పాటనే పాడారు. కశ్మీర్ ప్రజల గొంతు విప్పడానికి స్వయం నిర్ణయాధికారం తీసుకోవడానికి పాకిస్తాన్ గొంతు వినిపిస్తుందని.. కశ్మీరీ ప్రజల  పోరాటంలో కాశ్మీరీలకు పాకిస్తాన్ “దౌత్యపరమైన, నైతిక” మద్దతును కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. ఆర్టికల్ 370పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని 'రాజకీయ ప్రేరేపితమైనది' అని పాకిస్థాన్ తాత్కాలిక పీఎం కాకర్ అభివర్ణించారు.

Pakistan: ఆర్టికల్ 370 రద్దుపై పాక్ ప్రధాని నిరసన.. కశ్మీర్ ప్రజల కోసం 300 సార్లు యుద్ధం చేయడానికి రెడీ అంటూ..
pakistan-pm-anwaarul-haq-kakar
Surya Kala
|

Updated on: Dec 15, 2023 | 3:24 PM

Share

జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్ధించింది. అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు నిర్ణయంపై పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్‌ విమర్శించారు. కశ్మీర్‌కు అండగా ‘పాకిస్తాన్ ఉంటుందని.. కశ్మీర్ కోసం 300 యుద్ధాలైనా చేస్తుందని.. భారత్ తో పోరాడుతుందని’ కాకర్ అన్నారు. పాకిస్థాన్‌పై మూడుసార్లు యుద్ధాలు చేశారని తాత్కాలిక ప్రధాని గుర్తు చేశారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపార్థం ఉండకూడదని కాశ్మీర్, శ్రీనగర్, బారాముల్లాపై తమకున్న అపోహలను తొలగించాలంటూ స్పష్టం చేశారు.

ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌ విషయంలో అసెంబ్లీలో పాక్ తాత్కాలిక  ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్‌ మాట్లాడుతూ..  మళ్లీ పాట పాటనే పాడారు. కశ్మీర్ ప్రజల గొంతు విప్పడానికి స్వయం నిర్ణయాధికారం తీసుకోవడానికి పాకిస్తాన్ గొంతు వినిపిస్తుందని.. కశ్మీరీ ప్రజల  పోరాటంలో కాశ్మీరీలకు పాకిస్తాన్ “దౌత్యపరమైన, నైతిక” మద్దతును కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. ఆర్టికల్ 370పై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ‘రాజకీయ ప్రేరేపితమైనది’ అని పాకిస్థాన్ తాత్కాలిక పీఎం కాకర్ అభివర్ణించారు.

భారత ప్రజాస్వామ్యాన్ని “ప్రపంచంలోనే అతి పెద్ద కపటత్వం”గా అభివర్ణించిన పాక్ ప్రధాని

తాత్కాలిక ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ భారతదేశాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే కంటే “ప్రపంచంలోని అతిపెద్ద కపట” దేశం అని అభివర్ణించారు.  కుల ఆధారిత సామాజిక పాలన, క్రమబద్ధమైన బెదిరింపులు, మైనారిటీలను అణగదొక్కడం, ప్రభుత్వ ప్రాయోజిత హత్యలు,  లౌకికవాదం ముసుగులో ఉగ్రవాదాన్ని దాచడం, ప్రజాస్వామ్యం, వైవిధ్యం అనే  నినాదాలను ఉపయోగిస్తూ తాను చేసే పనులను ప్రపంచం నుంచి దాచేస్తుందని ఆయన ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

భారత్‌తో యుద్ధం అనివార్యం..

ఆగస్ట్ 5, 2019న కేంద్ర ప్రభుత్వ తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు సమర్ధించడం శోచనీయం అంటూ పాక్ ప్రధాని ఖండించారు. ఇది రాజకీయంగా ప్రేరేపించబడిందని పేర్కొన్నారు. కాశ్మీరీ ప్రజలకు జరిగిన అన్యాయాన్నీ తాము ఖండిస్తున్నామని.. కశ్మీర్ ప్రజల పట్ల పాకిస్తాన్ తిరుగులేని నిబద్ధతను  కలిగి ఉందని కాకర్ చెప్పారు. అంతేకాదు గిల్గిత్-బాల్టిస్తాన్ , కాశ్మీర్‌లో ఏ భాగాన్ని ఎవరూ తీసుకోలేరని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..