E Scooter: మొన్న హైదరాబాద్‌.. నేడు యూకే. ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఎందుకు కాలిపోతున్నాయి.. లోపం ఎక్కడ.?

E Scooter: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. విపరీతమైన ఇంధన వినియోగంతో కాలుష్యం పెరుగుతుండడంతో దాదాపు అన్ని..

E Scooter: మొన్న హైదరాబాద్‌.. నేడు యూకే. ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఎందుకు కాలిపోతున్నాయి.. లోపం ఎక్కడ.?
Follow us

|

Updated on: Oct 04, 2021 | 6:43 PM

E Scooter: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. విపరీతమైన ఇంధన వినియోగంతో కాలుష్యం పెరుగుతుండడంతో దాదాపు అన్ని దేశాలు విద్యుత్‌ ఆధారిత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ దారులకు, వినియోగదారులకు ఆయా దేశాల ప్రభుత్వాలు సబ్సిడీలను సైతం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో కూడా వీటిపై ఆసక్తి పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం సైతం భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన రెండు సంఘటనలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఎంత వరకు సేఫ్‌ అనే ప్రశ్నలకు తలెత్తేలా చేస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కాలిపోయింది. దీనికి సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రోడ్డు పక్కన ఆగిన స్కూటర్‌లో ఉన్నట్లుండి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ఆ తర్వాత స్కూటర్‌లో నుంచి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారంతా భయంతో పరిగెత్తారు. దీనికి సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది.

E Scooter Fire

ఇది మరిచి పోకముందే..

హైదరాబాద్‌లో జరిగిన సంఘటన మరిచిపోకముందే యూకేలో ఇలాంటి ఓ ఘటనే జరిగింది. దీంతో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూకేలోని నార్తాంప్టన్షైర్ అనే ఓ చిన్న దేశంలో చోటు చేసుకున్న సంఘటన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల భద్రతను ప్రశ్నిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నార్తాంప్టన్షైర్ ఓ ఇంటి యజమాని తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇంట్లో పార్కింగ్ చేశాడు. అయితే రాత్రి నిద్రిస్తోన్న సమయంలో స్కూటర్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా వచ్చిన మంటలతో ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. దీంతో వెంటనే స్పందించిన ఇంటి సభ్యులు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ అంశం యూకేలో హాట్‌ టాపిక్‌గా మారింది.

అసలు ప్రమాదాలకు కారణాలేంటి..?

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లు పేలి పోవడానికి ప్రధాన కారణంగా వాహనంలోని బ్యాటరీనే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలు నాణ్యమైన బ్యాటరీలు ఉపయోగించకపోవడం, బ్యాటరీల్లో తలెత్తే సమస్యలే ఇలాంటి ప్రదమాదాలకు కారణంగా మారుతున్నాయని భావిస్తున్నారు. ఇక ఇటీవల మొబైల్‌ ఫోన్‌లోని బ్యాటరీలు పేలుతున్న సంఘటనలకు, స్కూటర్‌లో పేలుతోన్న బ్యాటరీలకు లింక్‌ చేసి కారణాలను విశ్లేషిస్తున్నారు.

Also Read: Breaking: మూసీ నదిలో గల్లంతైన జహంగీర్ మృతదేహం లభ్యం.. 10 ఏళ్ల క్రితం తండ్రి కూడా ఇలాగే

Durga Malleswara Swamy Temple: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. గత 6 రోజుల్లో రూ.1.6 కోట్ల ఆదాయం

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..

Latest Articles