Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..

గంగవ్వ.. ఇప్పుడు ఈ పేరు తెలియనివారుండరు.. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‏లో షార్ట్ ఫిల్మ్స్‏లో నటించే గంగవ్వ.. అతి తక్కువ సమయంలోనే

God Father: గాడ్ ఫాదర్‏లో మై విలేజ్ షో గంగవ్వ.. చిరంజీవి సినిమాలో తన పాత్ర ఏంటో చెప్పేసిందిగా..
Gangavva
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 5:54 PM

గంగవ్వ.. ఇప్పుడు ఈ పేరు తెలియనివారుండరు.. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‏లో షార్ట్ ఫిల్మ్స్‏లో నటించే గంగవ్వ.. అతి తక్కువ సమయంలోనే పాపులారిటీని అందుకుంది. తన నటనతో.. తెలంగాణ యాసతో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది. షార్ట్ ఫిల్మ్స్‏తో సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్‏తో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే ఛాన్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత బిగ్‏బాస్ ఇంట్లో గంగవ్వ ఆట తీరుతో మరింత పాపులారిటీ అందుకోవడమే కాకుండా.. షో నుంచి బయటకు వచ్చాక వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం వెండితెరపై కనిపిస్తూ.. తన నటన.. మాట తీరుతో ప్రేక్షకులను అలరిస్తుంది గంగవ్వ. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి ఇటీవల విడుదలైన సూపర్ హిట్ మూవీ లవ్ స్టోరీ సినిమాలో గంగవ్వ కీలక పాత్రలలో నటించి ఆకట్టుకుంది.

తాజాగా గంగవ్వ బంపర్ ఆఫర్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో గంగవ్వ నటిస్తున్నట్లుగా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈవార్తలపై క్లారిటీ ఇచ్చేసింది గంవగ్వ. తాను నిజంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆ మూవీలో తన పాత్ర ఏంటో కూడా చెప్పెసింది. లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‏కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ.. తాను చిరంజీవి సినిమా కోసం ఊటీ వెళ్లానని.. అందులో చిరంజీవి తల్లి పాత్రలో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. దీంతో అతి తక్కువ సమయంలోనే గంగవ్వ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఆచార్య సినిమా పూర్తిచేసిన చిరంజీవి.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Maa Elections 2021: ఇండస్ట్రీలో ఎన్నికల రచ్చ.. నరేష్ పై తీవ్ర ఆగ్రహం.. మాట్లాడేముందు ఆలోచించుకోవాలని వార్నింగ్..

Pelli Sandadi: న్యూస్‌ యాంకర్‌గా మారిన శ్రీకాంత్‌ తనయుడు.. ఈ మార్పు వెనక కారణమేంటంటే..

Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ముందుకు ఒక్కొక్కరి నిజస్వరూపాలు.. షణ్ముఖ్, సిరి, జెస్సీలకు షాక్..