Maa Elections 2021: ఇండస్ట్రీలో ఎన్నికల రచ్చ.. నరేష్ పై తీవ్ర ఆగ్రహం.. మాట్లాడేముందు ఆలోచించుకోవాలని వార్నింగ్..

మా ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను మించి పోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికలలో తెలుగు భాష.. లోకల్,

Maa Elections 2021: ఇండస్ట్రీలో ఎన్నికల రచ్చ.. నరేష్ పై తీవ్ర ఆగ్రహం.. మాట్లాడేముందు ఆలోచించుకోవాలని వార్నింగ్..
Prakash Raj
Rajitha Chanti

|

Oct 04, 2021 | 5:08 PM

మా ఎన్నికలు ఈసారి రాజకీయ ఎన్నికలను మించి పోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. ఎన్నికలలో తెలుగు భాష.. లోకల్, నాన్ లోకల్ అనే వాదనలు వినిపించాయి. అంతేకాకుండా.. ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండడంతో.. పలువురు సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈసారి మా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. అలాగే ఈసారి మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతుండడంతో మా ఎన్నికలు హీటెక్కాయి. ఇక మా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఈరోజు తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రకాష్ రాజ్.. మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా.. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మా సిగ్గు్పడేలా నరేష్ వ్యవహరిస్తున్నారని.. ఆయన అహంకారి అని.. మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఈసారి జరిగే ఎన్నికల్లో తనకు సినీ పెద్దల ఆశీర్వాదం వద్దని.. పెద్ద వాళ్లను సైతం ప్రశ్నించే సత్తా ఉన్నవాడే మా అధ్యక్షుడిగా గెలవాలన్ననారు. ఈ సత్తా తనకు ఉందని.. అందుకే తను ఈసారి మా ఎన్నికల్లో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తనను తెలుగు వాడు కాదు.. నాన్ లోకల్ అన్న నరేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలుగు మాట్లాడినంతగా.. విష్ణు ప్యానల్లో ఉన్నవారు తెలుగు మాట్లాడరని.. తనను ఇంతగా పెంచింది తెలుగు భాష అని చెప్పుకొచ్చారు. అలాగే. తన ప్యానల్‏లో ఉన్న సభ్యులకు ఆత్మాభిమానం ఉందని.. తాము ప్రశ్నించకపోతే మా ఎన్నికలే ఉండేవి కాదన్నారు. తాను ఒక ఉత్తరం రాస్తే.. మా అసోసియేషన్ కు తాళం పడేదని… సౌమ్యంగా కాదు. కోపంగా మాట్లాడం కూడా తనకు తెలుసన్నారు. ఇక మా ఎన్నికల్లోకి పార్టీలను, ముఖ్యమంత్రులను తీసుకురావద్దని.. బంధువులు, స్నేహితులు అయినంత మాత్రం ఎన్నికల్లోకి లాగొద్దన్నారు.

ఇక పోటీలో ఉన్నవారు.. గెలవడానికి ప్రయాత్నించాలని.. కానీ ఎదుటివారిని ఓడించడానికి కాదని .. తనకు వచ్చే ఓట్ల సునామిలో విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుందన్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో మా ఎన్నికలు మరింత వేడెక్కాయి.

Also Read: Pelli Sandadi: న్యూస్‌ యాంకర్‌గా మారి న్యూస్‌ చెబుతోన్న శ్రీకాంత్‌ తనయుడు.. హీరో యాంకర్‌గా ఎందుకు మారాడనేగా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu