Pelli Sandadi: న్యూస్‌ యాంకర్‌గా మారిన శ్రీకాంత్‌ తనయుడు.. ఈ మార్పు వెనక కారణమేంటంటే..

Pelli Sandadi: శ్రీకాంత్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమాల్లో 'పెళ్లి సందడి' చిత్రం ఒకటి. 1996లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రాఘవేంద్రరావు డైరెకక్షన్‌, కీరవాణి..

Pelli Sandadi: న్యూస్‌ యాంకర్‌గా మారిన శ్రీకాంత్‌ తనయుడు.. ఈ మార్పు వెనక కారణమేంటంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2021 | 5:02 PM

Pelli Sandadi: శ్రీకాంత్‌ కెరీర్‌లో బెస్ట్‌ సినిమాల్లో ‘పెళ్లి సందడి’ చిత్రం ఒకటి. 1996లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. రాఘవేంద్రరావు డైరెకక్షన్‌, కీరవాణి మ్యూజిక్‌ డైరెక్షన్‌లో వచ్చిన పాటలు సినిమాను బ్లాక్‌ బస్టర్‌ చేయడంలో కీలకపాత్ర పోషించాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా నటిస్తుండడం మరో విశేషం.

నిజానికి రోషన్‌ ఇది వరకు ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంలో నటించినప్పటికీగా పూర్తి స్థాయిలో హీరో పాత్రలో నటిస్తోన్న తొలి చిత్రం మాదే ఇదేనని చెప్పాలి. ఇక ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కరోనా కారణంగా కొన్ని రోజులు షూటింగ్‌ వాయిదా పడినప్పటికీ తర్వాత శర వేగంగా షూటింగ్‌ జరుపుకుంది.

ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సినిమా ప్రమోషన్‌ను పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే తాజాగా హీరో, హీరోయిన్లతో ఓ స్పెషల్‌ వీడియోను రూపొందించారు చిత్ర యూనిట్‌. ఈ వీడియోలో రోషన్‌ ఓ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌గా చూపించారు. ఇక హీరోయిన్‌ రిపోర్టర్‌గా కనిపిస్తుంది. పెళ్లి సందడి పాటలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ ప్రకటనను వినూత్నంగా రూపొందించారు.

ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్‌ అవుతోంది. సినిమా ప్రమోషన్‌ను ఇలా వినూత్నంగా చేపడుతున్నందుకు చిత్ర యూనిట్‌కు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సినిమా రోషన్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి. ఇక శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు అతిధి పాత్రలో కనిపిస్తుండడం విశేషం.

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్‏బాస్ ముందుకు ఒక్కొక్కరి నిజస్వరూపాలు.. షణ్ముఖ్, సిరి, జెస్సీలకు షాక్..

MAA Elections 2021: “మా” ఎన్నికలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. తేల్చేశారు

Prabhas: మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయిన ప్రభాస్.. ఆ తేదీన డార్లింగ్ 25వ సినిమా ప్రకటన..

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!