Prabhas: మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయిన ప్రభాస్.. ఆ తేదీన డార్లింగ్ 25వ సినిమా ప్రకటన..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోరు మీదున్నాడు. వరుస ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్

Prabhas: మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసేందుకు రెడీ అయిన ప్రభాస్.. ఆ తేదీన డార్లింగ్ 25వ సినిమా ప్రకటన..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2021 | 3:26 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ జోరు మీదున్నాడు. వరుస ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ మూవీ పూర్తి చేసిన డార్లింగ్. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ షూటింగ్‍లోనూ… బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలోనూ పాల్గోంటున్నాడు. అంతేకాకుండా.. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవల్లో కావడం మరో విశేషం. దీంతో ప్రభాస్ స్పీడ్ చూసి.. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం షాకవుతున్నారు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ.. మరోవైపు వరుస ప్రాజెక్ట్‏లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ… బిజీ షెడ్యూల్‏ గడిపేస్తున్నాడు ప్రభాస్.

ఇవే కాకుండా.. ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియాను మించి ఉండబోతుందని గతంలోనే నాగ్ అశ్విన్ ప్రకటించాడు. దీంతో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సలార్, ఆదిపురుష్ సినిమాల తర్వాత.. ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇది డార్లింగ్ కెరీర్‏లో 24వ సినిమా. ఇదిలా ఉంటే.. తన 25వ సినిమాను ఆయన ఎవరితో చేయనున్నారో త్వరలోనే ప్రకటించనున్నారట. ఈనెల 7వ తేదీన ప్రభాస్ 25వ సినిమమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట. డైరెక్టర్.. నిర్మాణ సంస్థ.. నటీనటులకు సంబంధించిన అన్ని వివరాలు ఈనెల 7న తెలియబోతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ప్రభాస్, రాజమౌళి కాంబోలో మరో మూవీ రాబోతుందని.. ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గటుగానే..రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా పూర్తైంది. దీంతో ప్రభాస్ 25వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మాత్రం ఈనెల 7వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి.. వరుస ప్రాజెక్ట్స్‏ను పట్టాలెక్కిస్తూ.. ఫుల్ జోరుమీదున్నాడు ఈ యంగ్ రెబల్ స్టార్. ఇక త్వరలోనే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్వీట్..

Also Readd: Movie Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు

Maa Elections 2021: మా ఎన్నికల హీట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే