Rashmi Gautam: తీవ్ర భావోద్వేగానికి గురైన యాంకర్‌ రష్మి.. ఇది మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం అంటూ ట్వీట్‌.

Rashmi Gautam: బుల్లి తెర యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రష్మి గౌతమ్‌. ఓ వైపు బుల్లి తెరపై కనిపిస్తూనే మరోవైపు సిల్వర్‌ స్క్రీన్‌పై..

Rashmi Gautam: తీవ్ర భావోద్వేగానికి గురైన యాంకర్‌ రష్మి.. ఇది మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం అంటూ ట్వీట్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 04, 2021 | 3:16 PM

Rashmi Gautam: బుల్లి తెర యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రష్మి గౌతమ్‌. ఓ వైపు బుల్లి తెరపై కనిపిస్తూనే మరోవైపు సిల్వర్‌ స్క్రీన్‌పై అడపాదడపా తళుక్కుమంటోందీ చిన్నది. ఇక కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది రష్మి. ఈ క్రమంలోనే తన కెరీర్‌ విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతటితో ఆగకుండా సమాజంలో జరిగే సంఘటనలపై కూడా తనదైన శైలిలో స్పందించే రష్మి తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ అమానుష సంఘటనపై భావోద్వేగానికి గురైంది.

వివరాల్లోకి వెళితే.. తాజాగా మధ్యప్రదేశ్‌లో దేవాస్‌లో ఇటీవల మున్సిపల్‌ సిబ్బంది వీధి కుక్కులను పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. అయితే ఇదే సమయంలో ఓ కుక్కకు తాడి కట్టి దాని ముఖంపై విపరీతంగా కొట్టారు. సుమారు 30 నిమిషాలపాటు కుక్కను అత్యంత దారుణంగా పెద్ద కర్రతో కొడుతూనే ఉన్నారు. దీనిని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఏ ఒక్కరు కూడా ఆపడానికి ప్రయత్నించలేదు.. ఇదే రష్మిని కోపానికి కారణమైంది.

ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసిన రష్మి.. ‘ఆ అమానుషాన్ని మానవత్వం లేని ఎంతోమంది అలా చూస్తుండిపోయారు. ఇది మానవజాతి తుడిచిపెట్టుకుపోయే సమయం. అసలు మనకు ఈ భూమ్మీద ఉండే అర్హతే లేదు’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు రష్మికి మద్ధతుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Movie Releases: ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు

Maa Elections 2021: మా ఎన్నికల హీట్.. సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్..

Naga Chaitanya: ‘ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌’.. నాగచైతన్య ట్వీట్.!