CDC warning: కోళ్లను ముద్దు చేస్తున్నారా….. వాటి ద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్.. సీడీసీ హెచ్చరిక
బతికున్న కోళ్లు, బాతులను ముద్దు చేయవద్దని.. వాటి నుంచి ఇన్‌ఫెక్షన్ సోకుతోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)....
బతికున్న కోళ్లు, బాతులను ముద్దు చేయవద్దని.. వాటి నుంచి ఇన్‌ఫెక్షన్ సోకుతోందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది. అక్కడ ఇటీవలి కాలంలో కోళ్లు, బాతుల నుంచి సంక్రమించే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్లు అధిక సంఖ్యలో వెలుగుచూస్తున్నాయి దీంతో వైద్యారోగ్య శాఖ అధికారులు, సీడీసీ దీనిపై ఫోకస్ పెట్టింది. కాగా ఇంటి వెనుక పౌల్ట్రీలు ఉండేవారికి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకినట్లు అధికారులు గుర్తించారు. కోళ్లు, బాతులు చూడటానికి ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, వాటి నుంచి బ్యాక్టీరియా వ్యాపించే ముప్పుందని సీడీసీ వెల్లడించింది. ముఖ్యంగా అవి ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారికి ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం అధికంగా ఉందని తెలిపింది. ఈ ఇన్‌ఫెక్షన్ సోకితే డయేరియా, కడుపు నొప్పి, వాంతులు , విరేచణాలు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇన్ఫెక్షన్ బారిన పడ్డ కొందరు రోగులు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే.. కోలుకుంటారు. కానీ అశ్రద్ద చేస్తే మాత్రం ప్రాణాలకు కూడా ముప్పు ఉందని అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా సోకుతున్నందున.. పక్షుల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచాలని సీడీసీ సూచించింది. సరిగా వండని మాంసం, గుడ్లు, బతికున్న పక్షుల్లో ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుందని.. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పౌల్ట్రీల్లో తప్పనిసరిగా తిరగాల్సి వస్తే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సీడీసీ తెలిపింది.
Also Read: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్ ఫంగస్ వస్తుందా…? ఇదిగో క్లారిటీ
బిర్యానీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజన్.. మంత్రి రిప్లై భలే ఫన్నీ