AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nasal Spray: నాసల్ స్ప్రేతో కోవిద్ వైరస్ మాయం…కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ బయోటెక్ సంస్థ ప్రకటన

తాము ఉత్పత్తి చేస్తున్న 'నాసల్ వ్యాక్సిన్' కోవిద్-19 ని 99 శాతం నివారిస్తుందని కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనే బయోటెక్ సంస్థ ప్రకటించింది. ముక్కు ద్వారా తీసుకునే...

Nasal Spray: నాసల్ స్ప్రేతో  కోవిద్ వైరస్ మాయం...కెనడాలోని  శానోటైజ్ రీసెర్చ్ బయోటెక్ సంస్థ ప్రకటన
Vaccine Shortage
Umakanth Rao
| Edited By: |

Updated on: May 29, 2021 | 4:10 PM

Share

తాము ఉత్పత్తి చేస్తున్న ‘నాసల్ వ్యాక్సిన్’ కోవిద్-19 ని 99 శాతం నివారిస్తుందని కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనే బయోటెక్ సంస్థ ప్రకటించింది. ముక్కు ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిన్ చాలా మంచి ఫలితాలనిస్తోందని వెల్లడిస్తోంది. కోవిద్-19 వైరస్ లోడ్ ని ఇది 99 శాతం నాశనం చేయగలదు…లేదా నివారించగలదని నిరూపించామని ఓ జర్నల్ లో ఈ సంస్థ పేర్కొంది. వైరస్ ముక్కు ద్వారా ఊపిరితిత్తులకు వ్యాపించకుండా అడ్డుకుంటుందని, గత మార్చిలో కోవిద్ కి గురైన 79 మందిపై ‘డబుల్ బ్లెండ్..ప్లేసెబో ..కంట్రోల్డ్ ఫేస్-2’ పేరిట దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించగా అధిక వైరల్ లోడ్ గల రోగులతో బాటు ఇతర రోగుల లోనూ మంచి అద్భుత ఫలితాలు కనిపించాయని ఈ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ముక్కు ద్వారా దీన్ని స్ప్రే చేసినప్పుడు మొదటి 24 గంటల్లో వైరస్ లోడ్ తగ్గిందని, తరువాత 72 గంటల్లోగా మరింతగా..అంటే 99 శాతం తగ్గిన సూచనలు కనిపించాయని వారు తెలిపారు. బ్రిటన్ కోవిద్ వేరియంట్ పై కూడా ఈ వ్యాక్సిన్ మంచి ప్రభావాన్ని చూపిందన్నారు. కెనడాతో బాటు కొన్ని ఇతర దేశాల్లోనూ ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించామని ఎవరిలోనూ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని వారు స్పష్టం చేశారు.

ఈ నాసల్ వ్యాక్సిన్ అమ్మకానికి ఇజ్రాయెల్, న్యూజిలాండ్ దేశాలు గత మార్చి 23 నే అనుమతించాయి. అయితే అత్యవసర వినియోగానికి న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ ఇంకా అనుమతించాల్సి ఉంది. ఇజ్రాయెల్ లో ఎనోవిడ్ పేరిట దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు. గత ఏప్రిల్ 20 న ఇండియాలో తమ వ్యాక్సిన్ ని పంపిణీ చేసే విషయంలో భారత ప్రభుత్వంతో చర్చలు జరిగాయని ఈ సంస్థ తెలిపింది. ఇండియాలోని ప్రముఖ ఔషధ సంస్థలు సహకరిస్తే దీన్ని విస్తరించే అవకాశాలు ఉంటాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : నాకే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారా..?యాదాద్రి భువనగిరి జిల్లాలో యువకుడు హల్‌చల్‌ వీడియో :Viral Video

 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్స్ పేరుతో మోసాలు మెసేజ్ ఓపెన్ చేసారో అంతే సంగతులు..వీడియో.: Vaccine Video.

 తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందించే దిశగా అడుగులు వేస్తున్న గూగుల్ – సుందర్ పిచాయ్:Google Reliance video.

Follow Us
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది