Prize Money: కాలిఫోర్నియా సర్కార్ బంపర్ ఆఫర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ‘ప్రైజ్ మనీ’.. ఎందుకో తెలుసా?

Coronavirus Vaccine Prize Money: ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో అతలాకుతలమైంది. ఓ వైపు పెరుగుతున్న కేసుల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా కట్టడికి

Prize Money: కాలిఫోర్నియా సర్కార్ బంపర్ ఆఫర్.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ‘ప్రైజ్ మనీ’.. ఎందుకో తెలుసా?
Covid-19 Vaccine
Follow us

|

Updated on: May 29, 2021 | 1:34 PM

Coronavirus Vaccine Prize Money: ప్రపంచం మొత్తం కరోనావైరస్‌తో అతలాకుతలమైంది. ఓ వైపు పెరుగుతున్న కేసుల మధ్య వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య సంస్థలు, నిపుణుల అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చాలామంది అపోహ, నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో పలు ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ వీలైనంత తొందరగా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నవారందరికీ.. లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు భారీ మొత్తంలో నగదును ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోని.. 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్లు) ను సొంతం చేసుకోవాలని సూచించింది. దయచేసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోండి… 116 మిలియన్‌ డాలర్లను సొంతం చేసుకోండి.. అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

వచ్చేనెల 15న ఆంక్షలు ఎత్తివేసి, సాధారణ జీవనానికి మార్గం సుగమం చేసేందుకు అమెరికా సర్కారు ప్రణాళికలు చేస్తోంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేసేందుకు ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. 12 ఏళ్లు దాటినవారంతా టీకా తీసుకోవాలని నెలలుగా ప్రచారం చేసినా, ఇప్పటివరకూ 3.4 కోట్ల మంది జనాభాలో 63% మందే వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మిగిలినవారికి వీలైనంత త్వరగా కోవిడ్ డోసు అందించేందుకు గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ప్రైజ్‌ మనీ ఆఫర్‌ను ప్రకటించారు. కనీసం తొలిడోసు తీసుకుంటే దీనికి అర్హత ఉంటుందని తెలిపారు.

జూన్‌ 4తో ఈ లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. మొత్తం 10 మందికి 1.5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు… 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన గిఫ్ట్‌ కూపన్లు ఇవ్వనున్నట్లు కాలిఫోర్నియా ప్రభుత్వం తెలిపిందే. కాగ.ా. ఇప్పటికే ఒహాయో, కొలరాడో, ఒరెగాన్‌ రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్‌ను ప్రకటించాయి. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు భారీ ఉపకారవేతనాలు, ఫీజుల చెల్లింపులను సైతం ప్రకటించడం గమనార్హం.

Also Read:

Prime Minister: ప్రధాన మంత్రి మెడకు బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఉచ్చు.. నిధుల దుర్వినియోగమంటూ పోలీసుల విచారణ షురూ!

ఆ కెనడా ఎంపీ మళ్ళీ ఏం చేశాడంటే .? ‘తప్పు’ ఒప్పుకుంటున్నా…! అపాలజీ చెబుతున్నా అంటూనే … !