ఆ కెనడా ఎంపీ మళ్ళీ ఏం చేశాడంటే .? ‘తప్పు’ ఒప్పుకుంటున్నా…! అపాలజీ చెబుతున్నా అంటూనే … !

కెనడా ఎంపీ విలియం అమోస్ మళ్ళీ వార్తల్లోకెక్కాడు. ప్రభుత్వానికి సంబంధించి ఓ కార్యక్రమం జరుగుతుండగా అది వీడియో కాల్ అన్న విషయం మరచి ఓ కాఫీ కప్ లో మూత్ర విసర్జన చేశాడట..

  • Publish Date - 12:39 pm, Sat, 29 May 21 Edited By: Phani CH
ఆ కెనడా ఎంపీ మళ్ళీ ఏం చేశాడంటే .?   'తప్పు' ఒప్పుకుంటున్నా...! అపాలజీ చెబుతున్నా అంటూనే ... !
Canadian Mp Urinates Into Coffee Cup

కెనడా ఎంపీ విలియం అమోస్ మళ్ళీ వార్తల్లోకెక్కాడు. ప్రభుత్వానికి సంబంధించి ఓ కార్యక్రమం జరుగుతుండగా అది వీడియో కాల్ అన్న విషయం మరచి ఓ కాఫీ కప్ లో మూత్ర విసర్జన చేశాడట.. చివరకు చిక్కాడు. ఈ మహాశయుడు కొన్ని వారాల క్రితం నగ్నంగా కనిపించి పతాక శీర్షికలతో కూడిన వార్తల్లో భాగమయ్యాడు. అయితే ఈ రెండు సంఘటనలు యాదృచ్చికమని, ఇప్పుడు ఎంతో చింతిస్తున్నానని అంటున్నాడు. గత రాత్రి వర్చ్యువల్ గా హౌస్ ఆఫ్ కామన్స్ ప్రొసీడింగ్స్ జరుగుతుండగా అది కెమెరాకు ఎక్కుతోందని తెలియక తాను ఈ పని చేశానని చెబుతున్నాడు. ఇందుకు చాలా చింతిస్తున్నానని, తన చర్య ఎవరికైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని తన ట్విట్టర్లో కోరాడు. ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని పాలక లిబరల్ పార్టీలో సభ్యుడైన విలియం అమోస్.. తన ఆపాలజీని కూడా పోస్ట్ చేశాడు. పబ్లిక్ కి తాను కనబడనని భావించి అలా చేసినట్టు పేర్కొన్నాడు. ఇది పూర్తిగా తన పొరబాటేనన్నాడు. ఇందుకు పార్లమెంటరీ సెక్రటరీగా తన బాధ్యతల నుంచి కొంతకాలం తప్పుకుంటానని తెలిపాడు.

ఇంత చెప్పిన ఈ ఎంపీ.. తన నియోజకవర్గ ప్రజలు, తన స్టాఫ్, తన తోటి ఎంపీలు తనను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని, అలాగే తన కుటుంబానికి కూడా కృతజ్ఞతలని పేర్కొన్నాడు. ఈయనగారు పూర్తి నగ్నంగా ఉన్న ఓ స్క్రీన్ షాట్ గత ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో వైరస్ల అయి సెన్సేషన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కాఫీ కప్ లో మూత్ర విసర్జన చేసి వార్తలకెక్కాడు. ఇలాంటి ఎంపీలను జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఎలా భరిస్తోందో మరి.. కెనడాలోని కొందరు ఎంపీలు లైంగిక వేధింపుల విమర్శలను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

 

మరిన్ని ఇక్కడ చూడండి: River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )

Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )

Credit Cards: ఇక ఆ బ్యాంకు నుంచి సులభంగా క్రెడిట్‌ కార్డు పొందవచ్చు.. ( వీడియో )