AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prime Minister: ప్రధాన మంత్రి మెడకు బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఉచ్చు.. నిధుల దుర్వినియోగమంటూ పోలీసుల విచారణ షురూ!

ఆమె ఓ దేశానికి ప్రధాని.. పదవిలోకి వచ్చి రాగానే తనదైన శైలిలో పరిపాలన మొదలు పెట్టారు. విచిత్రమైన సంస్కరణలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అదే దూకుడుతో ఓ చిత్రమైన స్కామ్‌లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం విపక్షాల విమర్శలతోపాటు.. పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు.

Prime Minister: ప్రధాన మంత్రి మెడకు బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఉచ్చు.. నిధుల దుర్వినియోగమంటూ పోలీసుల విచారణ షురూ!
Finland
Rajesh Sharma
|

Updated on: May 29, 2021 | 3:07 PM

Share

Prime Minister struck in Breakfast bill scam: ఆమె ఓ దేశానికి ప్రధాని.. పదవిలోకి వచ్చి రాగానే తనదైన శైలిలో పరిపాలన మొదలు పెట్టారు. విచిత్రమైన సంస్కరణలతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అదే దూకుడుతో ఓ చిత్రమైన స్కామ్‌లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం విపక్షాల విమర్శలతోపాటు.. పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఫిన్లాండ్ దేశ ప్రధానిగా సన్నా మారిన్ 2019లో పదవీ బాధ్యతలు చేపట్టారు. అధికారంలోకి వచ్చాక తనదైన పరిపాలన శైలిని దేశ ప్రజలకు చూపించారు. పలు సంస్కరణలతో దేశప్రజలనే కాదు.. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారామె. చూడడానికి అందంగా.. ఎప్పుడు నవ్వుతూ వుండే సన్నా మారిన్.. ప్రస్తుతం చిక్కుల్లో పడింది.

ఫిన్లాండ్ ప్రధాన మంత్రి సన్నా మారిన్ కెసరంటాలోని ప్రధాని అధికారిక నివాసంలో తన కుటుంబంతో సహా నివసిస్తారు. తన కుటుంబం కోసం నెలకు ఏకంగా 300 యూరోలను వెచ్చిస్తున్నారు. ఈ మొత్తాన్ని దేశ ఖజానా నుంచి ఆమె వాడుకుంటున్నట్లు వెల్లడి కావడంతో ఫిన్లాండ్‌లో కలకలం చెలరేగింది. ఫ్యామిలీ బ్రేక్​ఫాస్ట్ కోసం ఆమె నెలకు 300 యూరోల అధికారిక సొమ్ము ఖర్చు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫిన్లాండ్​ ప్రధాని సన్నా మారిన్​.. కెసరంటాలోని అధికారిక నివాసంలో కుటుంబంతో సహా ఉంటోంది. అయితే బ్రేక్​ఫాస్ట్ కోసం నెలకు 300 యూరోలు(365 డాలర్లు) ఖర్చు అవుతున్నట్లు చూపిస్తూ.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచి ఆమె క్లెయిమ్​ చేస్తోంది. ఈ మేరకు స్థానిక పత్రిక ఒకటి కథనం ప్రచురించడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో సన్నా మారిన్ స్పందించారు. ఒక ప్రధానిగా తాను ఎలాంటి సౌకర్యాలు కోరుకోలేదని, అలాంటి నిర్ణయమూ తీసుకోలేదని ఆమె ట్వీట్​ చేశారు. నిజానికి నెలకు మూడొందల యూరోలంటే.. మన దేశ కరెన్సీలో సుమారు 25 వేల రూపాయలు. నెలకు కేవలం 25 వేల రూపాయలను ఓ దేశ ప్రధాని సొంతానికి వినియోగిండమంటే పెద్ద విషయం కాదనే మనం భావిస్తాం. కానీ ఫిన్నిష్ చట్టాల ప్రకారం ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క యూరోని అక్రమంగా వినియోగించినా నేరంగానే భావిస్తారు. ఇదే ఇప్పుడు సన్నా మారిన్‌కు ఇబ్బందికరంగా మారింది.

Sanna

Sanna

రీఎంబర్స్​మెంట్​ గురించి చట్టంలో ఎక్కడా లేదన్న పోలీసులు.. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫిన్నిష్​ చట్టాలకు విరుద్ధంగా సన్నా వ్యవహరించారని, ఆమె ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇదిలా వుండగా.. తనపై పోలీస్​ విచారణను సన్నా స్వాగతించారు. కాగా, 35 ఏళ్ల సన్నా మారిన్​ డిసెంబర్​ 2019లో ఫిన్లాండ్​కు ప్రధాని అయ్యారు. పాలనతో పాటు కరోనా కట్టడిలో మిగతా యూరోపియన్​ దేశాల నుంచి శెభాష్​ అనిపించుకున్నారు. కానీ, తర్వాతి నుంచి ఆమె క్రేజ్​ పడిపోతూ వస్తోంది. ఈ మేరకు జూన్ 13న జరగబోయే స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్ష రైట్​ వింగ్ పార్టీ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో సన్నా బ్రేక్‌ఫాస్ట్ స్కామ్‌లో ఇరుక్కోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామం విపక్షానికి అవకాశంగాను.. అధికార పార్టీకి శాపంగాను మారిందని స్థానిక మీడియా కథనాలు రాస్తోంది.

ALSO READ: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి