AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిద్ పై పోరుకు ఇండియాకు అమెరికా భారీ సాయం… విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హర్షం

ఇండియాలో కోవిద్ సహాయక చర్యలకు గాను అమెరికా 500 మిలియన్ డాలర్లకు పైగా సాయం చేసింది. అవసరమైతే ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ ఎఫైర్స్ ప్రధాన అధికారి...

కోవిద్ పై పోరుకు ఇండియాకు అమెరికా భారీ సాయం... విదేశాంగ  మంత్రి ఎస్. జైశంకర్ హర్షం
Us Help To India For Fight On Covid Crisis
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 29, 2021 | 2:33 PM

Share

ఇండియాలో కోవిద్ సహాయక చర్యలకు గాను అమెరికా 500 మిలియన్ డాలర్లకు పైగా సాయం చేసింది. అవసరమైతే ఇంకా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ ఎఫైర్స్ ప్రధాన అధికారి, తాత్కాలిక మంత్రి కూడా అయిన డీన్ తాంప్సన్ తెలిపారు. తమ దేశ ప్రభుత్వంతో బాటు తమ దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు, ప్రైవేటు వ్యక్తులు కూడా సహాయం చేయడానికి రెడీగా ఉన్నట్టు ఆయన వెల్లడించారు. కోవిద్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఇండియా అదనంగా 20 మిలియన్ డోసుల ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేయడానికి వీలుగా తమ ఆర్దర్లలో ఒకదాన్ని రీడైరెక్ట్ చేశామని ఆయన వివరించారు. భారత దేశానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను, ఇతర వైద్య సామాగ్రిని పంపడంలో తాము ఎంతో కృషి చేశామని అధ్యక్షుడు జోబైడెన్ ఇటీవల ప్రకటించారు. ఈ తరుణంలో ఆ దేశానికి ఎంతో సాయపడుతున్నామన్నారు. ప్రత్యేకంగా తాను భారత ప్రధాని మోదీతో మాట్లాడానని, అవసరమైతే మరింత సాయం చేస్తామని చెప్పానని ఆయన అన్నారు.

ఈ తరుణంలో ఇండియాకు అమెరికా చేస్తున్న సాయానికి గాను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. మా దేశంలో కోవిద్ కేసులు తగ్గుతున్నాయని, ఇందుకు మీ హెల్ప్ ఎంతగానో దోహదపడిందని ఆయన అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ కు రాసిన లేఖలో తెలిపారు. పైగా ఇటీవలే ఆయన అమెరికా వెళ్లి అక్కడ ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడి వచ్చారు. ప్రత్యేకంగా బ్లింకెన్ తో సమావేశమయ్యారు కూడా.. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గత 20 రోజులుగా తగ్గుతున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రికవరీలు చాలా పెరిగాయని, అయితే మరణాల సంఖ్య కూడా ఇంకా తగ్గాల్సి ఉందని అభిప్రాయపడింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )

River: ఇండియాలో సముద్రంలో కలవని ఏకైక జీవనది ఇదే..! నీరు ఒక దగ్గర తియ్యగా మరో దగ్గర ఉప్పగా..? ( వీడియో )

Rare Bird: నల్లమలలో కెమెరాకు చిక్కిన అరుదైన ‘అడవి రైతు’ పక్షి.. ( వీడియో )