AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HYDERABAD HOTELS: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి

హైదరాబాద్ మహానగరంలో ఇంతకాలం ఆతిథ్యం ఇస్తూ వస్తున్న హోటల్స్ మరోసారి కరోనా ఐసాలేషన్ కేంద్రాలుగా మారాయి. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు, అతిథులు...

HYDERABAD HOTELS: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి
Hyd Hotels
Rajesh Sharma
|

Updated on: May 29, 2021 | 2:54 PM

Share

HYDERABAD HOTELS AS ISOLATION CENTRES: హైదరాబాద్ మహానగరంలో ఇంతకాలం ఆతిథ్యం ఇస్తూ వస్తున్న హోటల్స్ మరోసారి కరోనా ఐసాలేషన్ కేంద్రాలుగా మారాయి. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు, అతిథులు లేకపోవడంతో కరోనా పాజిటివ్ (CORONA POSITIVE) వచ్చిన వారికి ఐసోలేట్ అవ్వడానికి అవకాశం ఇస్తున్నారు. తద్వారా ఎంతో కొంత బిజినెస్ (BUSINESS) చేసుకునేందుకు హోటళ్ళ యాజమాన్యాలు (HOEL MANAGEMENTS) ప్లాన్ చేశాయి. కరోనా కేసులతో ప్రభుత్వ (GOVERNMENT), ప్రైవేట్ ఆసుపత్రులు (PRIVATE HOSPITALS) నిండి పోతున్న క్రమంలో కొన్ని హోటళ్లు కోవిడ్‌ బాధితులకు (COVID PATIENTS) సేవలందించేందుకు ముందుకొచ్చాయి.

కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో (CORPORATE HOSPITALS) ఒప్పందం కుదుర్చుకుని హోటళ్లలోని సింగిల్‌, డబుల్‌ బెడ్‌ రూంలను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చారు. వాటిని పాజిటివ్‌ రోగులకు కేటాయిస్తున్నాయి హోటళ్ళ యాజమాన్యాలు. బ్రేక్‌ఫాస్ట్‌ (BREAKFAST), లంచ్‌ (LUNCH), హై టీ (HIGH TEA), డిన్నర్‌ (DINNER)లను కలిపి డెయిలీ ప్యాకేజీ (DAILY PACKAGES)లను, వారం, 14 రోజుల ప్యాకేజీలను సిద్దం చేశాయి. క్వారంటైన్‌లో ఉన్న వారికి ట్రీట్మెంట్ తో పాటు మిగతా సేవలందిస్తున్నారు. హోం ఐసొలేషన్‌ (HOME ISOLATION)లో ఉండలేని కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి కోసం 70కి పైగా బెడ్లతో ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసింది హోటల్ లెమన్ ట్రీ (HOTEL LEMON TREE) యాజమాన్యం. మహావీర్‌ ఆస్పత్రి సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసి కరోనా పేషెంట్ లకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రతీరోజు ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి టెలికాన్ఫరెన్సు ద్వారా డాక్టర్లతో సంప్రదింపును అరేంజ్ చేస్తున్నారు. అవసరమైన వారికి డాక్టర్ విజిట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

గత సంవత్సరం కరోనా మొదటి వేవ్‌ (CORONA FIRST WAVE)లోను కోల్పోతున్న ఆదాయాన్ని ఎంతో కొంత రాబట్టుకునేందుదు హైదరాబాద్ నగరం (HYDERABAD CITY)లోని పలు స్టార్ హోటళ్ళు (STAR HOTELS), చిన్నా చితకా హోటళ్ళు (HOTELS) కూడా ఐసోలేషన్ ప్యాకేజీ (ISOLATION PACKAGES)లను అందించారు. ప్రస్తుతం వారం రోజుల ప్యాకేజీ (WEEKLY PACKAGE)కి 40 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నిర్వహకులు. అత్యవసర పరిస్థితుల్లో రోగికి కావాల్సిన ఆక్సిజన్‌ (OXYGEN), అంబులెన్స్‌ (AMBULENCE) సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాక ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సదుపాయం కల్పిస్తున్నారు. వైద్యంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని.. ఒకవేళ అవసరమైన వారు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావచ్చని నిర్వాహకులు అంటున్నారు.

ALSO READ: ప్రధాన మంత్రి మెడకు బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఉచ్చు.. నిధుల దుర్వినియోగమంటూ పోలీసుల విచారణ షురూ!