కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై విచారణ జరగాల్సిందే!
రెండు ప్రపంచయుద్ధాలప్పుడు కూడా ప్రపంచం ఇంతగా వణికిపోలేదు.. ఆధిపత్యం కోసం కొట్టుకు ఛస్తున్నారు, చావనీ భారమైన తగ్గుతుందని అనుకుంది.
రెండు ప్రపంచయుద్ధాలప్పుడు కూడా ప్రపంచం ఇంతగా వణికిపోలేదు.. ఆధిపత్యం కోసం కొట్టుకు ఛస్తున్నారు, చావనీ భారమైన తగ్గుతుందని అనుకుంది. కానీ కరోనా వైరస్ సృష్టిస్తోన్న విలయానికి చిగురుటాకులా వణికిపోతోంది.. జనం ప్రాణాలు నిలువునా పోతుంటే భూమి కూడా కన్నీరుపెడుతోంది.. అసలు కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలేమిటి? నిజంగానే చైనాలోని వూహాన్‌లోని జంతువధ శాల నుంచి పుట్టుకొచ్చిందా? లేక అక్కడి ప్రయోగశాలల నుంచి ప్రమాదవశాత్తూ బయటపడిందా? సైంటిస్టులు కూడా దీనిపై ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులేమో చైనానే సృష్టికర్త అని అంటున్నారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అమెరికా అంటోంది.. మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీని అంతు చూడాల్సిందేని పంత పట్టారు.. తమ ఏజెన్సీ సంస్థలకు లక్ష్యాన్ని నిర్దేశించాడు. మూడు నెలలో వైరస్ పుట్టుక ఎక్కడో తెలుసుకోవాలన్నారు.
ఏడాదిన్నర కాలంగా కరోనా నానా బీభత్సాన్ని సృష్టిస్తూ వస్తోంది. లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. కోట్లాది మందిని ఆసుపత్రుల పాలు చేసింది.. ఈ ఏడాదిన్నర కాలంగా ఈ వైరస్‌ను ఎదుర్కోవడం ఎలా అన్నదానిపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి తప్ప సార్స్-కోవ్-2 వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది.? దాని ఆనుపానాలేమిటి? అన్నదానిపై అంతగా సీరియస్ వర్క్ చేయలేదు.. ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్‌లను కనిపెడతామా? ప్రజలను సురక్షితంగా ఉంచుదామా అన్నదే ఆలోచించాయి తప్ప కరోనా వైరస్ మూలాలను కనిపెట్టాలన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. నిరుడు ప్రపంచాన్ని ఈ వైరస్ చుట్టుముట్టినప్పుడే కచ్చితంగా ఇది చైనా సృష్టించిన మహమ్మారేనని మెజారిటీ ప్రజలు భావించారు. వూహాన్‌లోని ఓ ల్యాబ్ నుంచి ఇది బయటపడిందని గట్టిగా నమ్మారు. దీనిపై విచారణ జరపాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించారు కూడా!
చైనా మాత్రం వీటన్నింటినీ కొట్టిపాసింది. తమపై అకారణంగా నింద వేస్తున్నారని ఆరోపించసాగింది.. అయితే ప్రపంచ దేశాలు ఈ మాటను అంతగా విశ్వసించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చాయి.. వూహాన్‌కు వెళ్లి పరిశోధించాల్సిందేనని పట్టుపడ్డాయి. దాంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్స్‌పర్ట్ టీమ్ ఒకటి వూహాన్‌కు వెళ్లింది.. అక్కడ పరిశోధనలు చేసింది.. చివరాఖరికి ఈ వైరస్ అడవి జంతువుల నుంచి మనుషుల్లోకి వచ్చి ఉండవచ్చని తేల్చింది.. దీంతో ప్రపంచదేశాలు ఊపిరి తీసుకున్నాయి.. ఇప్పుడు కరోనా సెకండ్‌వేవ్ వేగంగా విస్తరిస్తూ జనాల మీద విరుచుకుపడుతుండటంతో మరోసారి వైరస్ పుట్టుక మీద చర్చలు మొదలయ్యాయి.. అసలీ వైరస్ ఎక్కడి నుంచి పుట్టిందో..? ఎలా పుట్టిందో.. ? ప్రపంచదేశాల మీద ఎలా దాడికి దిగిందో..? వంటి వివరాలతో కూడిన ఓ సమగ్ర నివేదికను 90 రోజుల్లో ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బౌడెన్ ఏజెన్సీలను ఆదేశించారు. దాంతో కరోనా ఎలా పుట్టిందో కచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందేనని ప్రపంచ దేశాలు అమెరికాతో గొంతు కలిపాయి.
వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ -డబ్ల్యూఐవీ నుంచే ఈ వైరస్ బయటకు వచ్చిందని, అయితే ఉద్దేశపూర్వకంగా దీన్ని బయటకు పంపారో, లేక కాకతాళీయంగా బయటకు వచ్చిందో తెలియాల్సిన అవసరం ఉందని చాలా మంది భావిస్తున్నారు. చైనాలోనే అతి పెద్ద బయలాజికల్ రీసెర్చ్ సెంటర్ అయిన వూహాన్‌లోనే కరోనా వైరస్‌ను మొదటిసారిగా గుర్తించారు. లాబోరేటరి నుంచి బయటపడ్డ వైరస్ మాంసం విక్రయించే మార్కెట్‌కు అంటుకుని ఉంటుందని అనుకుంటున్నారు. కాదు కాదు, జీవాయుధంగా చైనా ప్రయోగించి చూసి ఉంటుందని కొందరు అంటున్నారు. 2019 నవంబర్‌లో వూహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ముగ్గురు సైంటిస్టులకు కరోనా సోకిందని, వారు చికిత్స తీసుకున్నారని అమెరికా నిఘా చెబుతోంది. చైనా మాత్రం ఇప్పటికీ తమ తప్పేమీ లేదంటోంది. అమెరికా అవాస్తవాలు చెబుతున్నదని విమర్శిస్తోంది. ఇతర దేశాల నుంచే ఈ పీడ తమకు అంటుకుని ఉంటుందని చైనా గట్టిగా అంటోంది.
సరైన ఆధారాలు లేకపోవడంతో సైంటిస్టులు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన పరిశోధన తూతూ మంత్రంగా సాగిందే తప్ప మూలాల్లోకి వెళ్లి పరిశీలన చేయలేదని సైంటిస్టులు అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఇందులో కుట్ర కోణం ఉండి ఉంటే ఆ విషయాన్ని వెంటనే కనుక్కోవాలని చెబుతున్నారు. కాగా, కరోనా వైరస్ పుట్టుకపో సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని అంటున్నాయి. భారత్ కూడా ఇదే మాట చెబుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అనంతపురంలో వింత ఆచారం.. వేంకటేశ్వరునికి బాలికతో మొదటి వివాహం.. ( వీడియో )
Rare Bird: నల్లమలలో కెమెరాకు చిక్కిన అరుదైన ‘అడవి రైతు’ పక్షి.. ( వీడియో )