చైనాలో కొనసాగుతున్న అవినీతి ప్రక్షాళన.. మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!
చైనా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు అవినీతి కేసులో మరణశిక్ష పడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీ ఫెన్‌హే, లీ షాంగ్‌ఫులపై వచ్చిన ఆరోపణలు నిజమని చైనా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మరణశిక్ష ఖరారు చేసింది కోర్టు.

చైనా ప్రభుత్వంలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు అవినీతి కేసులో మరణశిక్ష పడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న వీ ఫెన్‌హే, లీ షాంగ్‌ఫులపై వచ్చిన ఆరోపణలు నిజమని చైనా కోర్టు నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు మరణశిక్ష ఖరారు చేసింది కోర్టు.
2024లో వీరిద్దరిపై అవినీతి ఆరోపణల విచారణ ప్రారంభమైంది. దాదాపు రెండేళ్ల పాటు సాగిన లోతైన విచారణ అనంతరం, వీరికి మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
వీ ఫెన్‌హే: 2018 నుండి 2023 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఆయన రాకెట్ సైన్స్ విభాగంలో కీలక అధికారిగా ఉండేవారు. 2023లో ఆయనను ఆకస్మికంగా పదవి నుండి తొలగించిన ప్రభుత్వం, అనంతరం విచారణ చేపట్టింది. కాంట్రాక్టర్ల నుండి భారీగా కమీషన్లు, ఖరీదైన బహుమతులు స్వీకరించి అక్రమంగా సంపద కూడబెట్టారని ఆయనపై రుజువైంది.
లీ షాంగ్‌ఫు: వీ ఫెన్‌హే తర్వాత రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కాంట్రాక్టుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈయన్ని కూడా పదవి నుండి తప్పించి విచారించారు.
అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2012లో అధికారం చేపట్టాక “అవినీతి రహిత చైనా” లక్ష్యంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో గత మూడేళ్లలోనే సుమారు 15,000 మంది మాజీ అధికారులపై చర్యలు తీసుకున్నారు. వీరిలో 100 మందికి పైగా ఉన్నత స్థాయి సైనిక మరియు ప్రభుత్వ అధికారులు ఉండటం గమనార్హం. “అవినీతి విషయంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CPC) ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని, ఎంతటి వారైనా శిక్ష తప్పదు” అని జిన్‌పింగ్ ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో హెచ్చరించారు.
2022-2025 మధ్య కాలంలో చైనా ప్రభుత్వం లంచగొండితనం కేసుల్లో ముగ్గురికి మరణశిక్ష విధించింది. ఇప్పటివరకు అవినీతి ఆరోపణల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగుల సంఖ్య 10 లక్షల మంది పైమాటే. సైనిక క్రమశిక్షణను ఉల్లంఘించిన వారికి కఠిన కారాగార శిక్షలు లేదంటే మరణదండన శిక్షలు తప్పవు. ఒకప్పుడు అధికారాన్ని వెలగబెట్టిన మంత్రులే ఇప్పుడు మరణశిక్షకు గురికావడం, చైనా తన పరిపాలనలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలియజేస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
