AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung: చైనా మార్కెట్‌లో శామ్‌సంగ్‌‌కు బిగ్ షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వ్యాపారం బంద్.. అసలు కారణం ఇదే!

Samsung: శామ్‌సంగ్‌ చిప్ విభాగం లాభాల్లో ఉన్నప్పటికీ, టీవీ, హోమ్ అప్లయన్సెస్ విభాగాలు కంపెనీకి భారంగా మారాయి. గత ఏడాది ఈ విభాగం సుమారు 200 బిలియన్ వాన్ల (సుమారు 138 మిలియన్ డాలర్లు) నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఈ పరిస్థితుల..

Samsung: చైనా మార్కెట్‌లో శామ్‌సంగ్‌‌కు బిగ్ షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వ్యాపారం బంద్.. అసలు కారణం ఇదే!
Samsung
Subhash Goud
|

Updated on: May 07, 2026 | 7:07 PM

Share

Samsung: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం శామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్ చైనా మార్కెట్‌లో ఊహించని నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన స్థానిక కంపెనీల నుండి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక, అక్కడ తన టెలివిజన్, హోమ్ అప్లయన్సెస్ (రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు) వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్‌ను ఏలిన ఈ దక్షిణ కొరియా కంపెనీకి చైనాలో ఎదురైన ఈ పరిస్థితి ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

వ్యాపారం ఎందుకు ఆగిపోయింది?

WSJ నివేదిక ప్రకారం.. స్థానిక మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ, మారుతున్న వ్యాపార పరిస్థితుల కారణంగా కొన్ని వినియోగదారు ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేయక తప్పలేదని శామ్‌సంగ్‌ పేర్కొంది. అయితే, చైనాలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ చిప్స్ విక్రయాలను మాత్రం కంపెనీ కొనసాగించనుంది.

ఇది కూడా చదవండి: Army Canteen: ఆర్మీ క్యాంటీన్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయో తెలుసా? ఆ ‘సీక్రెట్’ తెలిస్తే షాక్ అవుతారు!

ఇవి కూడా చదవండి

పడిపోయిన మార్కెట్ వాటా:

పరిశోధనా సంస్థ ‘AVC Revo’ గణాంకాల ప్రకారం.. చైనా ఆఫ్ లైన్ మార్కెట్‌లో శామ్‌సంగ్‌ ఉనికి దాదాపు కనుమరుగైంది. ఏప్రిల్ ప్రారంభం నాటికి పరిస్థితి ఇలా ఉంది.

  • కలర్ టీవీలు: కేవలం 3.62% మార్కెట్ వాటా.
  • రిఫ్రిజిరేటర్లు: కేవలం 0.41% మాత్రమే.
  • వాషింగ్ మెషీన్లు: కేవలం 0.38%.

దీనికి భిన్నంగా చైనా స్థానిక బ్రాండ్లు టీవీ రంగంలో 90% పైగా, హోమ్ అప్లయన్సెస్ రంగంలో 60% పైగా మార్కెట్‌ను ఆక్రమించుకున్నాయి.

భారీ నష్టాలు:

శామ్‌సంగ్‌ చిప్ విభాగం లాభాల్లో ఉన్నప్పటికీ, టీవీ, హోమ్ అప్లయన్సెస్ విభాగాలు కంపెనీకి భారంగా మారాయి. గత ఏడాది ఈ విభాగం సుమారు 200 బిలియన్ వాన్ల (సుమారు 138 మిలియన్ డాలర్లు) నిర్వహణ నష్టాన్ని చవిచూసింది. ఈ పరిస్థితుల వల్లే టీవీ బిజినెస్ హెడ్‌ను మార్చినప్పటికీ, చివరకు వ్యాపారాన్ని మూసివేయడమే మేలని కంపెనీ నిర్ణయించుకుంది. ప్రభావితమైన కస్టమర్లు, వ్యాపార భాగస్వాములకు కంపెనీ అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: New Traffic Rules: వాహనదారులకు షాక్.. ఇక 45 రోజుల్లోగా చలాన్ చెల్లించకపోతే భారీ జరిమానా.. లైసెన్స్ కూడా రద్దు..!

ఇది కూడా చదవండి: Cooler Cooling Tips: మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. నీరంతా తాజాగా.. ఏసీ లాంటి కూలింగ్‌.. ఎవ్వరికి తెలియని సీక్రెట్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us