AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Canteen: ఆర్మీ క్యాంటీన్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయో తెలుసా? ఆ ‘సీక్రెట్’ తెలిస్తే షాక్ అవుతారు!

Army Canteen: మనం సాధారణంగా సరుకుల కోసం డిమార్ట్, రిలయన్స్ మార్ట్ లేదా కిరాణా షాపులకు వెళ్తుంటాం. ఎక్కడైనా 10% లేదా 20% డిస్కౌంట్ ఇస్తేనే "అబ్బో.. చాలా తక్కువకు వస్తున్నాయి" అని మురిసిపోతాం. కానీ ఆర్మీ క్యాంటిన్‌లో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. సగానికి సగం తగ్గిపోతుంటాయి. అసలు సీక్రెట్‌ తెలిస్తే షాకవుతారు..!

Army Canteen: ఆర్మీ క్యాంటీన్‌లో ధరలు అంత తక్కువగా ఎందుకుంటాయో తెలుసా? ఆ 'సీక్రెట్' తెలిస్తే షాక్ అవుతారు!
Army Canteen
Subhash Goud
|

Updated on: May 07, 2026 | 4:48 PM

Share

Army Canteen: మనం సాధారణంగా సరుకుల కోసం డిమార్ట్, రిలయన్స్ మార్ట్ లేదా కిరాణా షాపులకు వెళ్తుంటాం. ఎక్కడైనా 10% లేదా 20% డిస్కౌంట్ ఇస్తేనే “అబ్బో.. చాలా తక్కువకు వస్తున్నాయి” అని సంబరపడిపోతాం. కానీ ఆర్మీ క్యాంటీన్ (CSD) లో ధరలు చూస్తే మాత్రం ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. బయట మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు సగం ధరకే అక్కడ నాణ్యమైన వస్తువులు లభిస్తాయి. అసలు అంత తక్కువ ధరలకు ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Multibagger: అదృష్టం అంటే ఇదేనేమో.. రూ.లక్షకు రూ.14 లక్షలు.. ఇన్వెస్టర్లకు పండగే!

1. GST రాయితీ

దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులకు, మాజీ సైనికులకు ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద గౌరవం ఈ క్యాంటీన్ సదుపాయం. సాధారణ వస్తువులపై మనం బయట చెల్లించే GST (వస్తు సేవల పన్ను)లో ఆర్మీ క్యాంటీన్ వస్తువులపై 50% వరకు మినహాయింపు ఉంటుంది. అంటే ట్యాక్స్ భారం సగానికి సగం తగ్గిపోవడమే ధరలు తగ్గడానికి ప్రధాన కారణం.

ఇవి కూడా చదవండి

2. నేరుగా కంపెనీల నుంచే కొనుగోళ్లు

క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) వస్తువులను ఏ డీలర్ల నుంచో, హోల్‌సేలర్ల నుంచో కొనదు. నేరుగా తయారీ కంపెనీల నుంచే లక్షల సంఖ్యలో బల్క్ ఆర్డర్లు ఇస్తుంది. మధ్యలో దళారులు, కమిషన్ ఏజెంట్లు ఎవరూ ఉండకపోవడం వల్ల ఆ లాభం నేరుగా సైనికులకే అందుతుంది.

3. ధరల్లో వ్యత్యాసం ఎంతంటే?

  • నిత్యావసరాలు: బయట రూ.160 ఉండే లీటర్ నూనె, క్యాంటీన్‌లో రూ.110 కే దొరుకుతుంది. సబ్బులు, షాంపూలపై 40% వరకు డిస్కౌంట్ ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్స్: బయట రూ.40,000 పలికే స్మార్ట్ టీవీ లేదా ఏసీ, క్యాంటీన్‌లో సుమారు రూ.30,000 కే లభిస్తుంది.
  • మద్యం: అన్నిటికంటే ఎక్కువ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది. బయట రూ.2,000 ఉండే బ్రాండెడ్ బాటిల్, ఇక్కడ కేవలం రూ.800 నుండి రూ.900 కే లభిస్తుంది.
  • వాహనాలు: కార్లు, బైకులపై కూడా లక్షల్లో ఆదా చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

4. ఇది అందరికీ సాధ్యమేనా?

ఆర్మీ క్యాంటీన్ అనేది సూపర్ మార్కెట్ లాంటిదే అయినా, అక్కడికి ఎవరంటే వారు వెళ్లలేరు. కేవలం విధుల్లో ఉన్న సైనికులు, రిటైర్డ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. వారికి ప్రత్యేకమైన ‘స్మార్ట్ కార్డ్స్’ ఉంటాయి. ప్రతి నెలా ఒక నిర్ణీత కోటా (Limit) మాత్రమే కొనుగోలు చేయాలి. ఇష్టమొచ్చినట్లు స్టాక్ హోమ్ చేయలేరు. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న జవాన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ఈ గొప్ప వెసులుబాటు నిజంగా అభినందనీయం.

ఇది కూడా చదవండి: Cooler Cooling Tips: మీ కూలర్‌ నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు.. నీరంతా తాజాగా.. ఏసీ లాంటి కూలింగ్‌.. ఎవ్వరికి తెలియని సీక్రెట్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బయట రూ.100.. అక్కడ రూ.50 మాత్రమే! 'సీక్రెట్' తెలిస్తే షాకవుతారు!
బయట రూ.100.. అక్కడ రూ.50 మాత్రమే! 'సీక్రెట్' తెలిస్తే షాకవుతారు!
వెజిటేబుల్ మజ్జిగ పులుసు.. ఇలా చేసి తింటే బాడీలో ఉన్న హీట్ పరార్
వెజిటేబుల్ మజ్జిగ పులుసు.. ఇలా చేసి తింటే బాడీలో ఉన్న హీట్ పరార్
మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!
మాజీ రక్షణ మంత్రులకు మరణశిక్ష విధించిన కోర్టు!
రియాన్ పరాగ్ తర్వాత చహల్ వంతు.. ఐపీఎల్‌లో మళ్ళీ స్మోకింగ్ సెగలు
రియాన్ పరాగ్ తర్వాత చహల్ వంతు.. ఐపీఎల్‌లో మళ్ళీ స్మోకింగ్ సెగలు
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి
మోదీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. కేవలం 5 నిమిషాల్లో ఇలా చేసుకోండి
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా
డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే రూ. 3 వేలు గ్యారంటీగా ఆదా
NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌
NEET UG 2026 ఆన్సర్‌ కీ విడుదల.. ఈసారి భారీగా పెరగనున్న కటాఫ్‌
కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
కొడుకు సమాధి వద్ద వెక్కి వెక్కి ఏడ్చిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో
Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
Kuja Gochar: ఆ రాశుల వారికి ధన యోగం, అదృష్టం డబుల్..!
పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం
పళ్లురాని పసిపిల్లలు కూడా తినే పల్లెటూరి వంటకం నూకలపాయసం