Stand Up Comedy: స్టాండప్ కామెడీలో ఆ జోక్ వేశాడు.. కట్ చేస్తే రూ.17 కోట్లు జరిమాన
స్టాండప్ కామెడీ గురించి అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే సాధారణ విషయాలలో సైతం హ్యస్యాన్ని జోడించి అందరిని కడుపుబ్బా నవ్విస్తుంటారు. దీనికి మార్కెట్‌లో కూడా మంచి ప్రజాధారణ ఉంది. అయితే కొన్నిసార్లు వాళ్లు వాళ్లు వేసే జోకులు హద్దు మీరితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

స్టాండప్ కామెడీ గురించి అందరికీ తెలిసిందే. సమాజంలో జరిగే సాధారణ విషయాలలో సైతం హ్యస్యాన్ని జోడించి అందరిని కడుపుబ్బా నవ్విస్తుంటారు. దీనికి మార్కెట్‌లో కూడా మంచి ప్రజాధారణ ఉంది. అయితే కొన్నిసార్లు వాళ్లు వాళ్లు వేసే జోకులు హద్దు మీరితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ప్రేక్షకులను నవ్వించిన చైనా స్టాండప్ కమెడియన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. బీజింగ్‌లోని సెంచరీ థియేటర్‌లోలీ ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో హవోషి అనే స్టాండప్ కమెడియన్ తన ప్రదర్శన ఇచ్చాడు. జోకులు వేస్తూ అందరినీ నవ్విస్తున్నాడు. అలా చేస్తుండగా.. తాను షాంఘైకి వెళ్లిన సమయంలో వీధి కుక్కలను దత్తత తీసుకున్న విషయాన్ని వాళ్లకి వివరించాడు. ఇలా చెప్పే క్రమంలో చైనా సైన్యం చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్ చెప్పాడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులు ఈ జోక్‌కు నవ్వుతూ చప్పట్లు కొట్టారు.
అయితే ఈ షో పూర్తైన తర్వాత అతను వేసిన జోక్ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది కాస్త చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు కూడా హాస్యనటుడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి పరిస్థితిని అర్థం చేసుకున్న గమనించిన కమెడియన్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ అతడి కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ కమెడియన్ వేసిన జోక్ సైన్యాన్ని అవమానపరిచే విధంగా ఉందంటూ పేర్కొన్న చైనా సాంస్కృతిక శాఖ ఆ కంపెనీపై 14.7 మిలియన్ యువాన్ల అంటే మన కరెన్సీలో సుమారు రూ.17కోట్లు జరిమానా విధించింది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..
