AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ అధికారులపై కీలక వ్యాఖ్యలు.. వ్యాఖ్యతను సస్పెండ్ చేసిన బీబీసీ..

ఇటీవల ది కోశ్చన్ మోదీ డాక్యుమెంటరీతో వార్తల్లో నిలిచిన బీబీసీ.. అటెన్ బోర సరికొత్త సిరీస్‌ విషయంలోనూ, ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్ వ్యాఖ్యత గ్యారీ లినేకర్‌ను మ్యాచ్ డే షో నుంచి తప్పించిన విషయంలోనూ వివాదాలను ఎదుర్కొంటుంది. మరి, ఇవి ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

బ్రిటీష్ ఇమ్మిగ్రేషన్ అధికారులపై కీలక వ్యాఖ్యలు.. వ్యాఖ్యతను సస్పెండ్ చేసిన బీబీసీ..
Former England Football Captain Gary Lineker
Venkata Chari
|

Updated on: Mar 12, 2023 | 7:54 AM

Share

ఇటీవల ది కోశ్చన్ మోదీ డాక్యుమెంటరీతో వార్తల్లో నిలిచిన బీబీసీ.. అటెన్ బోర సరికొత్త సిరీస్‌ విషయంలోనూ, ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్ వ్యాఖ్యత గ్యారీ లినేకర్‌ను మ్యాచ్ డే షో నుంచి తప్పించిన విషయంలోనూ వివాదాలను ఎదుర్కొంటుంది. మరి, ఇవి ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ గ్యారీ లినేకర్ బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విధానంపై సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో బీసీసీ కొత్త ఫుట్‌బాల్ షో నుంచి అతడిని తొలగించింది. దీనిపై సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటుంది. అయితే, ఇందులో బీబీసీకి చెందిన సిబ్బందే గ్యారీ లినేకర్‌కు మద్దతు ప్రకటించడంతో పుండు మీద కారం చల్లినట్లైంది. ఇక చేసేందేంలేక బీబీసీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

గ్యారీ లినేకర్‌ను సస్పెండ్‌ చేయండంతో.. బీబీసీలో ప్రసారమయ్యే క్రీడా షోలను కేవలం వీకెండ్స్‌కే పరిమితం చేసింది. ఈ మేరకు బీబీసీ ఓ ప్రకటనలో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పింది. కేవలం వ్యాఖ్యాతలు హాజరుకాకపోవడంతోనే ఆ షోలను వీకెండ్స్‌కు మాత్రమే పరిమితం చేశామంటూ వివరణ ఇచ్చింది. గ్యారీ లినేకర్‌ను సస్పెండ్‌ చేయండంతో బీబీసీలో పనిచేసే ఇతర క్యాఖ్యతలు కూడా గ్యారీకి మద్దతుగా డ్యూటీలకు హాజరుకాలేదు.

బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విధానంపై సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేసిన గ్యారీ.. వలస కార్మికులపై వాడుతోన్న భాష చాలా అసభ్యంగా ఉందని, నాజీలను తలపిస్తోందంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై ఆగ్రహించిన బీబీసీ సంస్థ, ఆయన్ను సస్పెండ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు బీబీసీ ఓ ప్రకటనలో ఈ వ్యవహారంపై ఓ ప్రకటనను విడుదల చేసింది. గ్యారీ లినేకర్ తిరిగి రావాలని అనుకుంటే ముందుగా అతను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ప్రకటించింది.

గ్యారీ లినేకర్ తన సోషల్ మీడియా వినియోగంపై ఒప్పందం కుదుర్చుకునే వరకు మ్యాచ్ ఆఫ్ ది డే ప్రదర్శన నుంచి వైదొలగిస్తున్నట్లు బీబీసీ ప్రకటించింది. ప్రభుత్వం కొత్త విధానాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈమేరకు సోషల్ మీడియా యాక్టివిటీ మా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు బీసీసీ అందులో పేర్కొంది. పార్టీ రాజకీయ సమస్యలు లేదా రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలి పేర్కొంది. అందుకే తగిన చర్యలు తీసుకున్నట్లు బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ తెలిపారు.

ఈ మేరకు మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ బీబీసీపై ప్రశ్నల వర్షం కుపించారు. విలువలకు పెద్ద పీట వేస్తామన్న బీబీసీ మాటలు ఆచరణలో ఎందుకు చూపించరంటూ నిలదీశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..