బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారనుందా.. హసీనా స్వస్థలంలో ఫత్వా జారీ.. మహిళలు మార్కెట్లోకి అడుగు పెట్టవద్దంటూ ఆంక్షలు..

బంగ్లాదేశ్‌లో హేక్ హసీనా ప్రభుత్వం నుంచి మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ దేశంలో మైనారిటీలపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడుల ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. అయితే తాజా సంఘటనలతో బంగ్లాదేశ్ కూడా ఆఫ్ఘనిస్తాన్ బాటలో పనిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గోపాల్‌గంజ్ జిల్లాలోని గహర్దంగా ప్రాంతంలో మహిళలపై ఫత్వా జారీ చేశారు.

బంగ్లాదేశ్ మరో ఆఫ్ఘనిస్తాన్ గా మారనుందా.. హసీనా స్వస్థలంలో ఫత్వా జారీ.. మహిళలు మార్కెట్లోకి అడుగు పెట్టవద్దంటూ ఆంక్షలు..
Freedom Of WomenImage Credit source: X
Follow us
Surya Kala

|

Updated on: Dec 05, 2024 | 10:36 AM

అఫ్ఘానిస్థాన్‌ బాటలో బంగ్లాదేశ్‌ పయనిస్తోందా? ఛాందసవాదుల చర్యలతో.. ఇటీవలి దాడులతో ఇప్పటికే ఆ ప్రశ్నను అనేక మంది లేవనెత్తారు. అందుకు సమాధానం ఇదితో అందు బంగ్లాదేశ్ గోపాల్‌గంజ్ జిల్లాలోని గహర్దంగా ప్రాంతంలో మహిళలపై ఫత్వా జారీ చేశారు చాందసవాదులు. అది కూడా గోపాల్‌గంజ్‌లోని షేక్ హసీనా ఇల్లు ఉన్న పరిసర ప్రాంతంలోనే.. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం తెచ్చి బంగాబంధుగా పిలువ బడే షేక్ ముజిబుర్ రెహమాన్ స్వస్థలంలో ఈ ఫత్వా జారీ అయింది.

బంగ్లాదేశ్‌లోని కరడుగట్టిన మత ఛాందస వాదులు మహిళలపై ఫత్వా జారీ చేశారు. ఈరోజు అంటే గురువారం నుంచి మహిళలు మార్కెట్‌కి వెళ్లవద్దు అంటూ నిషేధం విధించారు. అంతేకాదు బురఖా లేని స్త్రీలకు వస్తువులు అమ్మడం నిషేధం అని.. ఈ ప్రాంతంలో షరియా చట్టం అమలు కానుందని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫత్వా ప్రస్తుతం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

బజార్‌లోకి వచ్చిన మత చాందసవాదులు బజార్‌లోకి మహిళలకు ప్రవేశం లేదని మైకులతో ప్రకటనలు చేస్తున్నారు. ఇక నుంచి మహిళ మార్కెట్‌కు వెళ్లి వస్తువులు కొనలేరు. మార్కెట్‌లోకి మహిళల ప్రవేశంపై నిషేధించబడింది. ఏదైనా అవసరమైతే బజారుకు ఇంటి మగవాళ్లే వెళ్ళాలని సూచించారు. మహిళలకు ఎటువంటి వస్తువులు విక్రయించవద్దని దుకాణదారులను కూడా హెచ్చరించారు. ఇప్పటికి ఈ గ్రామంలో మాత్రమే ఫత్వా జారీ చేసినల్టు.. క్రమంగా బంగ్లాదేశ్‌ మొత్తానికి ఫత్వానికి జారీ చేస్తామని కరడుగట్టినవారు హెచ్చరించారు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..