Mars Transit 2024: కర్కాటక రాశిలో తిరోగమనంలో కుజుడు.. ఈ రాశుల వారికి సుఖ సంపదలు
నవగ్రహాలలో అంగారక గ్రహం ఒకటి. ఈ గ్రహాన్నే కుజ గ్రహం అని కూడా అంటారు. త్వరలో కుజ గ్రహం రాశిని మార్చుకుని తిరోగమనంలో కదలబోతున్నాడు. అటువంటి పరిస్థితిలో అంగారకుడి రివర్స్ కదలిక కారణంగా కొన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తులు వృత్తి-వ్యాపారస్తులకు మాత్రమే కొన్ని రాశులకు చెందిన వ్యక్తిగత జీవితం కూడా ఆనందంతో నిండి పొంతుంది.
జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో నక్షత్రాలను, రాశులను మార్చుకుంటాయి. ఈ సమయంలో వివిధ రాశులను .. వివిధ మార్గాల్లో ప్రభావితం అవుతాయి. ఈసారి ధై ధైర్యం, స్వేచ్ఛ, అభిరుచి, సంకల్పం, బలం, శౌర్యం, వేగవంతమైన చర్య, దూకుడు, ప్రవర్తన, ఉద్రేకం, పోటీతత్వం, నిర్భయత, సహనం, దృఢ సంకల్పాల గ్రహం అయిన అంగారక గ్రహం తిరోగమనంలో ఉండనున్నాడు. అంటే మార్స్ రివర్స్‌లో కదలబోతున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే ఇది కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా.. ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కారణంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులు వృత్తి, వ్యాపారంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు వ్యక్తిగత జీవితం కూడా ఆనందంతో నిండి ఉంటుంది. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.
కుజుడు తిరోగమనం ఎప్పుడు అంటే
వేద క్యాలెండర్ ప్రకారం కుజుడు డిసెంబర్ 7, 2024 ఉదయం 05:01 గంటలకు కర్కాటక రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఇలా తిరోగమన స్థితిలో 24 ఫిబ్రవరి 2025, 07:27 am వరకు ఉండనున్నాడు.
ఏ రాశుల వారికి లాభాలు అంటే
కర్కాటక రాశి: ఈ రాశిలోనే కుజుడు తిరోగమనంలో ఉండనున్నాడు. దీంతో ఈ రాశుకి చెందిన వ్యక్తులు చాలా ప్రయోజనాలను పొందబోతున్నారు. ఉద్యోగం మారడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కార్యాలయంలో వీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య రాశి: ఈ రాశికి చెందిన వారికి కూడా అంగారకుడి సంచారం లాభదాయకమైన అవకాశాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో వ్యాపారస్తులు వ్యాపారంలో పురోగతిని పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలను తెరుస్తుంది. ఎప్పటి నుంచో తీరని కోరిక ఉంటె తీరుతుంది. ఈ సమయం వృత్తి, వ్యాపారానికి కూడా చాలా లాభదాయకంగా.. శుభప్రదంగా ఉంటుంది. దీనివల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు ప్రేమికులు సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఆనందం సుఖ శాంతులు ఉంటాయి.
మీన రాశి: కుజుడు తిరోగమనంలో ఉండటం వల్ల మీన రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో మీన రాశి విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. భౌతిక సుఖాలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.