AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: యూనివర్సిటీ వీసీ రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ విద్యార్థులు ఆందోళన.. అతని నేరం ఏమిటంటే..

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు మాత్రమే హిందూ సన్యాసులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. కృష్ణ దాస్ కేసు వాదించడానికి ఎవరినా లాయర్ వస్తే దాడులు తప్పవని ఇప్పటికే లాయర్స్ హెచ్చరిక జారీ చేయగా ఇప్పుడు రాడికల్ విద్యార్థుల వంతు వచ్చింది. యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ రాజీనామా చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రాజీమానా చేయమని గడువు ఇచ్చారు. యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు బైఠాయించి బైఠాయించారు. రాజీనామా చేయకుంటే యూనివర్సిటీలో చదువుతో పాటు ఎటువంటి కార్యకలాపాలు జరగనివ్వమని హెచ్చరించారు.

Bangladesh: యూనివర్సిటీ వీసీ రాజీనామా చేయాలని బంగ్లాదేశ్ విద్యార్థులు ఆందోళన.. అతని నేరం ఏమిటంటే..
Premier University
Surya Kala
|

Updated on: Dec 05, 2024 | 9:21 AM

Share

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసకు యావత్ ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతోంది. ఇప్పటికే బ్రిటన్ , అమెరికా వంటి దేశాలు ఈ దాడులను ఖండిస్తున్నాయి. తమ దేశ పౌరులకు అనేక సూచనలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ యూనివర్సిటీలో విధులను నిర్వహిస్తున్న వ్యక్తిని హిందువుగా పేర్కొంటూ.. వెంటనే రాజీనామా చేసి కళాశాలను విడిచి వెళ్ళమని డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా హిందువులను కొట్టడం, హిందూ ఆస్తులను ధ్వంసం చేయడం. దహనం వంటి అనేక సంఘటలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థులంతా వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అతని నేరం ఏమిటంటే అతను సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువు.

చిట్టగాంగ్‌లోని ప్రీమియర్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ రాజీనామా డిమాండ్ చేశారు. వైస్-ఛాన్సలర్ హిందూ మతం, ఇస్కాన్ ఆదర్శాలకు కట్టుబడి ఉన్నందున వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిట్టగాంగ్‌లోని ప్రీమియర్ యూనివర్శిటీలో వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ నిరసనలు కొనసాగుతున్నాయి.

ప్రీమియర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అనుపమ్ సేన్. ప్రముఖ విద్యావేత్త. ఆయన రాజీనామాకు సమయం ఇచ్చారు. యూనివర్సిటీ ఆవరణలో విద్యార్థులు బైఠాయించి.. రాజీనామా చేయకుంటే యూనివర్సిటీలో చదువుతో పాటు పనులన్నీ నిలిపివేస్తామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్ట్ తర్వాత బంగ్లాదేశ్ లో మళ్లీ వేడి రాజుకుంది. చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ కేసులో ఏ న్యాయవాది కూడా కోర్టుకు హాజరు కాలేదు. కేసు తీసుకునే న్యాయవాదులను రకరకాలుగా హింసిస్తున్నారని ఆరోపించారు. చిన్మోయ్ కృష్ణ దాస్ బెయిల్ కేసు మంగళవారం బంగ్లాదేశ్ కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయవాదులు ఎవరూ హాజరుకాకపోవడంతో విచారణ నెల రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..