Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆగని వివాదం.. చిన్మయ్ దాస్‌ సెక్రటరీ మిస్సింగ్, ప్రసాదం ఇవ్వబోతున్న ఇద్దరు హిందువుల అరెస్ట్

బంగ్లాదేశ్ లోని హిందువులపై దాడులు ఆగడం లేదు. ఇప్పటికే హిందూ గురువు చిన్మయ్‌ ప్రభును దేశద్రోహం కేసు కింద బంగ్లా ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. బెయిల్ ను నిరాకరించి జైలులో పెట్టింది. ఈ అరెస్ట్ తో వివాదం ఆగలేదు. ఇప్పుడు చిన్మయ్ దాస్ టూ కోసం ప్రసాదాన్ని తీసుకువెల్లిన భక్తులు తిరిగి ఆలయానికి వస్తుండగా అరెస్టు చేశారు. అంతేకాదు చిన్మోయ్ దాస్ కార్యదర్శి కూడా కనిపించలేదు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆగని వివాదం.. చిన్మయ్ దాస్‌ సెక్రటరీ మిస్సింగ్, ప్రసాదం ఇవ్వబోతున్న ఇద్దరు హిందువుల అరెస్ట్
Bangladesh Iskcon Controversy
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2024 | 8:50 AM

బంగ్లాదేశ్‌లో అరెస్టయిన చిన్మోయ్ కృష్ణ దాస్‌పై ఇస్కాన్ తన వైఖరిని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ హిందూ సెయింట్ చిన్మోయ్ కృష్ణ దాస్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఇస్కాన్ ఇప్పటికే తెలిపింది. చిన్మోయ్ దాస్ కార్యదర్శి కనిపించడం లేదని కోల్‌కతా ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ పేర్కొనడంతో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. అంతేకాదు మరో ఇద్దరు ఇస్కాన్ భక్తులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.

రాధారామ్ దాస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. ఒక చేదు వార్త తెలిసింది. చిన్మోయ్ దాస్ కోసం ప్రసాదం తీసుకెళ్ళిన్న ఇద్దరు భక్తులు ఆలయానికి తిరిగి వస్తుండగా అరెస్టు చేశారు. అంతేకాదు చిన్మోయ్ దాస్ కార్యదర్శి కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇస్కాన్‌తో అనుబంధం ఉన్న 17 మంది వ్యక్తుల బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేసిన సర్కార్

బంగ్లాదేశ్ ఆర్థిక అధికారులు 30 రోజుల పాటు ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్ తో పాటు ఇస్కాన్ సంస్థతో సంబంధం ఉన్న 17 మంది ఇతర వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను నిషేధించారు. మీడియా నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (BFIU) ఈ చర్య తీసుకుంది.

చిన్మోయ్ కృష్ణ దాస్‌ను దేశద్రోహం ఆరోపణలపై అరెస్టు చేశారు. అతనితో పాటు మరో 18 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 30న కేసు నమోదైంది. న్యూ మార్కెట్ ప్రాంతంలో హిందూ సంఘాల ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆరోపించారు.

అసలు వివాదం ఎలా మొదలైందంటే

‘సనాతన్ జాగరణ్ జోట్’ అధికార ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్‌పై చిట్టగాంగ్‌లో దేశద్రోహం కేసు నమోదైంది. గత నెలలో కాషాయ జెండాను ఎగురవేసి బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలున్నాయి. దీని తరువాత హిందూ సమాజం నిరసనల మధ్య దాస్‌ను మంగళవారం చిట్టగాంగ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి చిన్మోయ్ కృష్ణ దాస్‌ ను జైలుకు తరలించారు.

చిన్మోయ్ కృష్ణ దాస్‌ కోర్టు ప్రాంగణంలో హాజరయ్యే సమయంలో హింస చెలరేగింది. ఫలితంగా 32 ఏళ్ల న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ మరణించాడు. ఈ సంఘటన తర్వాత న్యాయవాది మృతికి దాస్ మద్దతుదారులే కారణమని జమాత్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇస్కాన్ సహా ఇతర హిందూ సంస్థలు ఈ ఆరోపణలను ఖండించాయి. కోర్టు ఆవరణలో హింసలో హిందువుల ప్రమేయం లేదని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఈ విషయం బంగ్లాదేశ్‌లో మతపరమైన, సామాజిక ఉద్రిక్తతను మరింత పెంచుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..