Karthika Amavasya: కార్తీక అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలంటే..

కార్తీక అమావాస్య తిధి రోజున చేసే పవిత్ర నదీ స్నానాలకు, దీప దానానికి, పితృ దోష నివారణానికు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజలు, దానాలు వలన పూర్వీకులు ప్రసన్నం అవుతారని.. ఆశీర్వదిస్తారని నమ్మకం. ఈ రోజు అమావాస్య కనుక ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..

Karthika Amavasya: కార్తీక అమావాస్య రోజున పితృదేవతల అనుగ్రహం కోసం ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలంటే..
Karthika Amavasya
Follow us
Surya Kala

|

Updated on: Nov 30, 2024 | 7:19 AM

ఆధ్యాత్మిక మాసం కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం.. కార్తీక మాసం నెల రోజులూ నదీ స్నానం ఆచరించి దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలూ ఆచరిస్తారు. ఈ నెల రోజులు చేసిన పూజలకు పుణ్యం దక్కాలంటే కార్తీక అమావాస్య తిథి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ కార్తీక అమావాస్య రోజుకి పురాణాల్లో విశిష్ట స్థానం ఉంది. మాసంలో చివరి రోజైన అమావాస్య రోజున మన శక్తి కొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానం చేయాలి. అయితే ఈ నెల రోజులు చేసిన స్నాన దాన జపాలకు ఫలం దక్కాలంటే ఈ అమావాస్య రోజు పితృ దేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో పవిత్ర నదిలో స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. పితృదేవతలకు శాంతిని, మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రార్ధ కర్మలను నిర్వహిస్తారు. వంశపారంపర్య దోషాల నివారణ కోసం చేసే పరిహరాలు కుటుంబంలో సుఖ సంతోషాలను తెస్తుందని నమ్ముతారు. అమావాస్య రోజును పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి రాశి ప్రకారం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేయడం శుభప్రదం అని చెబుతున్నారు.

కార్తీక మాసం అమావాస్య ఎప్పుడంటే

అమావాస్య తిధి నవంబర్ 30వ తేదీ శనివారం ఉదయం 10:30 నిమిషాల నుంచి ప్రారంభమై డిసెంబర్ 1 వ తేదీ మధ్యాహ్నం 11:51 ని. వరకు ఉండనుంది. అయితే పితృ దేవతలకు తర్పణం ఇవ్వడాలంటే ఉదయం తిధి ఉన్న రోజున చేయాలి. కనుక ఈ రోజు కార్తీక అమావస్యగా జరుపుకుంటున్నారు.

ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయడం శుభప్రదం అంటే

  1. మేష రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులు వేరుశెనగ, చిక్కుడు గింజలు, రాగి పిండి, బెల్లం వంటి వస్తువులను దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి శుభఫలితాలు ఇస్తారని నమ్మకం.
  2. వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారు పాలు, పాల పదార్ధాలు అంటే పెరుగు, వెన్న , నెయ్యి దీపం వంటి వాటిని దానం చేయడం శుభం.
  3. మిథునం రాశి: ఈ రాశి వారు పెసలు, పెసర పప్పు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అంటే ఆకు పచ్చ ఆహార పదార్ధాలను దానం చేయడం శుభప్రదం.
  4. కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వారు కార్తీక అమావాస్య రోజున బియ్యం, బియ్యం పిండి, గోధుమ పిండి, ఉప్పు, పంచదార వంటి దానం చేయడం మేలు చేస్తుంది.
  5. సింహ రాశి: అమావాస్య రోజున ఈ రాశివారు పప్పులు, రాగి పిండి, ఎండు మిరపకాయలు, గోధుమ పిండి వంటి వారిని దానం చేయాలి.
  6. కన్య రాశి: ఈ రాశి వారు పెసర పప్పు, పెసలు, డబ్బులను దానం చేయడం వల్ల శుభం
  7. తులా రాశి: ఈ రాశి వారు కార్తీక అమావాస్య రోజున గోధుమ పిండి, బియ్యం పిండి , ఉప్పు వంటి వాటిని దానం చేయవచ్చు.
  8. వృశ్చిక రాశి: ఈ రోజున ఈ రాశికి చెందిన వ్యక్తులు రాగులు, పప్పు లేదా దుంపలను దానం చేయడం మంచిది.
  9. ధనుస్సు రాశి: ఈ రోజున అరటి పండ్లు, బొప్పాయి, శనగపిండి, పసుపు రంగు వస్త్రాలను వంటి పసుపు రంగు వస్తువులను దానం చేయండి.
  10. మకర రాశి: ఈ రాశికి చెందిన వారు నలుపు రంగు వస్తువులు అంటే నల్ల నువ్వులు, ఆవాలు, నువ్వుల నూనె వంటి వాటిని దానం చేయడం శుభప్రదం
  11. కుంభ రాశి: వీరు ఈ రోజు నలుపు దుస్తులు, నల్ల దుప్పట్లు, తోలువస్తువులు అంటే చెప్పులు గొడుగు వంటి వాటిని దానం చేయాలి.
  12. మీన రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు శనగలు, సత్తు పిండి , అరటి కాయలు వంటి వాటిని దానం చేయవచ్చు
ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.