AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandikota: గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..

ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి సర్కార్‌ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. గండికోట, రాజమండ్రి పుష్కర్ ఘాట్‌ డెవలెప్‌మెంట్‌కు కేంద్రం నిధులు విడుదల చేయడమే అందుకు నిదర్శమన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.

Gandikota: గండికోటకు మహర్దశ.. అభివృద్ధికి 77 కోట్లు మంజూరు చేసిన కేంద్రం..
Gandikota Development
Surya Kala
|

Updated on: Nov 30, 2024 | 7:48 AM

Share

ఆంధ్రప్రదేశ్ లోని రాజుల పరిపాలనకు సజీవ సాక్ష్యం అయిన గండికోట అభివృద్ధికి కేంద్ర టూరిజం శాఖ 77.91 కోట్లు మంజూరు చేసింది. ఏపీలోని గండికోట, పుష్కర్ ఘాట్‌కు కేంద్ర టూరిజం శాఖ నిధులు విడుదల చేయడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఏపీలో గండికోటకు ప్రత్యేక గుర్తింపు ఉందని.. దాన్ని ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

అంతేకాదు రాజమహేంద్రవరం కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రానున్న పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పుష్కర్ ఘాట్ల నిర్మాణం చేపడతామన్నారు రామ్మోహన్‌నాయుడు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇక.. అరసవిల్లిని ప్రసాద్ స్కీమ్‌లో పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.

ఇవి కూడా చదవండి

పర్యాటకానికి అవకాశం ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కోరామని.. కేంద్ర సహకారంతో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. మొత్తంగా.. చరిత్రాత్మక గండికోట వైభవాన్ని పునరుద్ధరించడానికి, పర్యాటకంగా అభివృద్థి చేయడానికి కేంద్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కోట అభివృద్థితో పాటు స్థానిక నదీ పరివాహక ప్రాంతాన్ని కూడా పర్యాటకంగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం విడుదల చేసిన నిధులను వినియోగించనుంది ఏపీ ప్రభుత్వం. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..